అంతర్జాతీయం

యుద్ధంపై ఆసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: పాకిస్తాన్ ఆర్మీ తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదని శుక్రవారం పేర్కొంది. అయితే, భారత్ ఎలాంటి సైనిక చర్యకు దిగినా, అది విస్తుపోయేలా తాము బదులిస్తామని తెలిపింది. కాశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి బాంబుదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత ఇరు దేశాల మధ్య తీవ్రమయిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పుల్వామా ఘటనపై ఎలాంటి దర్యాప్తు జరపకుండానే భారత్.. పాకిస్తాన్‌ను నిందిస్తోందని విమర్శించారు. దేశ విభజన జరిగిందనే వాస్తవాన్ని కూడా భారత్ నేటికీ అంగీకరించడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘మాకు 72 ఏళ్ల చరిత్ర ఉంది. 1947లో విభజన జరిగింది. పాకిస్తాన్ విముక్తి పొందింది. భారత్ ఇప్పటికీ ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదు’ అని ఆయన అన్నారు. ‘మేము యుద్ధానికి సన్నద్ధం కావడం లేదు. మీరు బెదిరింపులకు దిగితే.. వాటికి స్పందించే హక్కు మాకు ఉంది. మాపై చర్యకు దిగితే, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు.