అంతర్జాతీయం

పాక్ హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23:పుల్వామా దాడికి బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా తెగేసి చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్‌లో గుబులు మొదలైంది. భారత్ ఎక్కడ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందోనన్న ఆందోళనతో ముందుగానే సన్నద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా పాక్ యుద్ధ విమానాల గస్తీ కొనసాగుతోందని, భారత దళాల కదలికలపై ఈ విమానాలు గట్టి నిఘా వేసినట్టుగా స్పష్టమవుతోంది. సర్గ్ధో, సియాల్‌కోట్, రావల్పిండి గగనతలంలో పాక్ ఏర్‌ఫోర్స్ విమానాలు కదన విన్యాసాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు వీలుగా వైమానిక, సైనిక దళాలను పాక్ సర్వసన్నద్ధంగా ఉంచినట్టు కూడా తెలుస్తోంది. అలాగే భారత సరిహద్దుల్లో సైనిక కదలికలపై డేగకన్ను వేయడానికి రాడార్లనూ పాక్ సిద్ధం చేసిందని చెబుతున్నారు.