అంతర్జాతీయం

రెండింటిని పడగొట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/లాహోర్, ఫిబ్రవరి 27: భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తన గగనతలంలోకి ప్రవేశించిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేయడంతోపాటు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ మిలిటరి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ పేర్కొన్నారు. గాయపడిన ఒక పైలట్‌ను ఆసుపత్రికి తరలించామని, మరో పైలట్‌కు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. అరెస్టయిన పైలట్ల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, పత్రాలను కూడా ఆయన చూపించారు. పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసిన 46 సెకండ్ల నిడివి గల వీడియోలో కండ్లకు గంతలు కట్టిన ఒక వ్యక్తి మాట్లాడుతూ, తాను ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌ను అని చెప్పారు. ‘నేను ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీస్ నెంబర్ 27981’ అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పారు. అయితే ఈ వీడియో నిజమా, కాదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మరోవైపు, పాకిస్తాన్ తన గగనతలంలో వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచి సహా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో విమానాల రాకపోకలను నిరవధికంగా రద్దు చేసింది. వాణిజ్య విమానాల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేంత వరకు విమానాశ్రయాలను మిలిటరి ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతుందని ఒక అధికారి ‘డాన్‌న్యూస్ టీవీ’కి చెప్పారు. రెడ్ అలర్ట్‌ను కూడా జారీ చేసినట్టు ఆయన తెలిపారు. జనరల్ గఫూర్ ఇస్లామాబాద్‌లో విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ రెండు ఐఏఎఫ్ విమానాలను కూల్చివేసినట్టు తెలిపారు. వీటిలో ఒక విమానం శకలాలు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లో, మరో విమానం శకలాలు జమ్మూకాశ్మీర్‌లో పడిపోయినట్టు ఆయన వివరించారు. ‘ఈ రోజు ఉదయం పీఏఎఫ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోనే ఉండి నియంత్రణ రేఖ వెంట గల ఆరు లక్ష్యాలపై గురిపెట్టాయి. పీఏఎఫ్ సైనిక స్థావరాలపై దాడి చేయరాదని ముందే నిర్ణయించడం జరిగిందని చెప్పారు. భీంబర్, నరన్ ప్రాంతాలపై పీఏఎఫ్ దాడి చేసింది. ఈ దాడుల తరువాత రెండు ఐఏఎఫ్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. పీఏఎఫ్ వాటిని ఎదుర్కొని, కూల్చివేసింది’ అని గఫూర్ వివరించారు. ‘నిజమయిన లక్ష్యాలు సైనిక పోస్టులు, పరిపాలనా స్థావరాలు. అయితే మేము వాటిని లక్ష్యంగా చేసుకోలేదు’ అని ఆయన వివరించారు. ప్రాణనష్టం ఉండకూడదనే ఉద్దేశంతో పీఏఎఫ్ తన లక్ష్యాన్ని మార్చుకుందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించినట్టు, వాటిలో ఒకదానిని భారత్ కూల్చివేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
చిత్రం..పాక్ విడుదల చేసిన వీడియోలోని దృశ్యం