అంతర్జాతీయం

సుష్మా హాజరైతే మేము రాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/దుబాయ్, ఫిబ్రవరి 27: వచ్చే నెలలో ఇస్లామిక్ సహకార సంస్థ (ఐవోసీ) సమావేశానికి భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరైన పక్షంలో తాము ఈ సదస్సును బహిష్కరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్‌ను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ సమావేశం మార్చి 1,2 తేదీల్లో అబూదాబీలో జరుగుతుంది. తమకు ఇస్లామిక్ దేశం, లేదా ఐవోసీలో విబేధాలు లేవని ఖురేషీ చెప్పారు. కాని ఈ సమావేశానికి సుష్మాస్వరాజ్ హాజరు కావడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్, టర్కీ విదేశాంగ శాఖ మంత్రి మేవ్లుట్ కేవ్‌సోగ్లుకు తెలియచేసినట్లు చెప్పారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ ఎందుకు హాజరవుతున్నారో తెలియడం లేదన్నారు. ఈ విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధికి తెలియచేసినట్లు ఆయన చెప్పారు. కాగా పాకిస్తాన్, ఇండియా సంయమనంతో ఉండాలని ఓఐసీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇరుదేశాలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరింది.