అంతర్జాతీయం

కుప్పకూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు: నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు నేపాల్‌లోని తాప్లేజంగ్ పర్వత ప్రాంతాల్లో ఓ ప్రేవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పర్యాటక, పౌర విమానయాన మంత్రి రబీంద్ర అధికారి, ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. అధికారి (39), ప్రముఖ పారిశ్రామికవేత్త అంగ్ సెరింగ్ షెర్పా, ప్రధాని వ్యక్తిగత సహాయకుడు యువరాజ్ దాహల్, ఇద్దరు సీనియర్ పౌరవిమానయాన అధికారులు, ఒక జవాను మృతి చెందారని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురూ మృత్యువాత పడ్డారని పర్యాటక ప్రతినిధి తెలిపారు. ఈస్ట్రన్ నేపాల్‌లోని ప్రసిద్ధ పతిబహారా హిందూ ఆలయాన్ని దర్శించుకుని మంత్రి, అధికారులు ఖాట్మండు వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. తాప్లేజంగ్ జిల్లాలోని ఛూఛాచే డాడా కొండను ఢీకొన్న హెలికాప్టర్ ఒక్కసారిగా తగలబడిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో పర్వత ప్రాంతమంతా దట్టమైన మంచుతో నిండిఉంది. ప్రమాద స్థలిలో ఎగసిపడుతున్న మంటలను చూసిస స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెద్ద శబ్ధం, దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ప్రమాదం నేపథ్యంలో ప్రధాని అధికార నివాసంలో అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.