అంతర్జాతీయం

హనోయ్‌లో ట్రంప్, కిమ్ చెట్టపట్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, ఫిబ్రవరి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మధ్య రెండవ విడత అంతర్జాతీయ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రంప్, కిమ్ ఆత్మీయతతో పరస్పరం కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అణ్వాయుధాలను విడనాడిన పక్షంలో ఉత్తర కొరియాకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఆకాంక్షించారు. గత ఏడాది జూన్‌లో ఇరుదేశాల అధినేతలు సింగపూర్‌లో తొలిసారి చర్చలు జరిపిన విషయం విదితమే. మళ్లీ ఎనిమిది నెలల వ్యవధిలో ట్రంప్, కిమ్ బుధవారం రాత్రి ఇక్కడి విలాసవంతమైన సోఫిటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్‌లో విందుకు హాజరుకానున్నరు. ఈ చర్చలకు ముందే ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చుని మీడియాకు ఫోటో ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఉత్తరకొరియాకు మంచి భవిష్యత్తు ఉందని, కాని ప్రపంచశాంతికి అణ్వాయుధాలను త్యజించాల్సి ఉంటుందన్నారు. కిమ్ స్పందిస్తూ తమ డిమాండ్లకు అంగీకరించాలంటూనే, అణ్వాయుధాలను దూరం జరిగేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు సలహాదారుల సహాయంతో చర్చలు జరపనున్నారు. అంతకుముందు ట్రంప్ ట్వీట్‌లో కూడా ఉత్తరకొరియా ప్రపంచ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ అంతర్జాతీయంగా దౌత్యంతో విజయంసాధించి సొంత దేశంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని చూస్తున్నారని దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతికి తన పేరును జపాన్ ప్రధాని ప్రతిపాదించినట్లు ట్రంప్ వర్గాలు పేర్కొంటున్నాయి. 1953లో కొరియా యుద్ధం ముగిసింది. అప్పటి నుంచి ఇరు కొరియా దేశాల మధ్య అగాధం పెరిగింది. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ట్రంప్ సరైన దారిలో నడుస్తున్నారని ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కిమ్ మాటలతో సరిపెట్టకుండా ఆచరణ యోగ్యమైన ఫార్ములాకు తలొగ్గాలని వాషింగ్టన్ దౌత్యనిపుణులంటున్నారు. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ మాట్లాడుతూ హనోయ్ సమావేశం ప్రాధాన్యత కలిగినదని, అణు నిరాయుధీకరణ దిశగా ఒక మంచి అడుగు అని పేర్కొన్నరు. ఇప్పటికే ఒక ఏడాది నుంచి ఉత్తరకొరియా ఎటువంటి అణ్వస్తప్రరీక్షలు, మిసైళ్ల పరీక్షలు నిర్వహించలేదు.