అంతర్జాతీయం

సంయమనమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 27: జైషే ఉగ్రతండాలపై లక్షిత దాడుల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశంగా భారత్-పాకిస్తాన్ ఆలోచన చేయాలని చైనా బుధవారం మరోసారి విజ్ఞప్తి చేసింది. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషి చేయాలని, సంయమనం పాటించాలని చైనా సూచించింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్న చైనా ‘ఇరుదేశాలు ఆ దిశగా దృష్టిసారించాలి’అని కోరింది. బాల్‌కోట్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దళం దాడులు నేపథ్యంలో పాకిస్తాన్ సైతం ప్రతిదాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున తాజాగా చైనా ఈ ప్రతిపాదన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.‘ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగించేవే. రెండు భారత్ యుద్ధ విమానాలు కూల్చేశామని పాక్ ప్రకటించుకుంది. ఇద్దరు పైలెట్లు తమ ఆధీనంలోనే ఉన్నామని వెల్లడించింది’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ అన్నారు. బీజింగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను అంతర్జాతీయ సమాజం దగ్గరగా గమనిస్తోందని వెల్లడించారు.‘ఈ విషయంలో మా వైఖరిని ఇంతకు ముందే స్పష్టం చేశాం. ఇరుదేశాలు శాంతియుత వాతవరణం నెలకొల్పే దిశగా ఆలోచించాలి. తక్షణం చర్చల ప్రక్రియను ప్రారంభించాలి’ అని ఆయన అన్నారు. దక్షిణాసియాలో ఇరుదేశాలు కీలకమైనవేనని అక్కడ శాంతి స్థాపన అత్యవసరంమని ఆయన వ్యాఖ్యానించారు. దాడులు, ప్రతిదాడులు ఇరుదేశాలకు నష్టమేనని, సంయమనం పాటించాలని మంగళవారమే చైనా విజ్ఞప్తి చేసిందని విదేశాంగ ప్రతినిధి గుర్తుచేశారు. పుల్వామాలో జైషే ఉగ్రదాడిలో 42 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.
భారత్‌కే మద్దతు
ఉజ్‌హెం: పొరుగు దేశంలో అశాంతిని సృష్టిస్తూ ఉగ్రవాద సంస్థలతో అంటకాగుతున్న పాకిస్తాన్‌ను ఏకాకిని చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పుల్వామాలో జైషే ఉగ్ర సంస్థ అమానుష దాడిలో 40 మంది జవాన్లు అశువులుబాసారు. పాక్ ప్రేరిత ఉగ్ర సంస్థలే దాడులకు పాల్పడుతున్నాయని భారత్ ఎప్పటి నుంచి ఆందోళన చెందుతోంది. తాజాగా పుల్వామా దాడి ఘటనతో అంతర్జాతీయంగా పాక్ చర్యలను ఎండగట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో భారత్ సఫలీకృతమైంది. బుధవారం ఇక్కడ జరిగిన రష్యా, ఇండియా, చైనా(ఆర్‌ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాల్సిందే.