అంతర్జాతీయం

‘నీస్’ దాడి మా పనే: ఐఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీస్, జూలై 16: ప్రాన్స్‌లోని నీస్ నగరంలో శుక్రవారం ట్రక్కు దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముఠా ప్రకటించుకుంది. ఈ మేరకు ఉగ్రవాదులకు చెందిన ‘అముఖ్’ వార్తాసంస్థ తెలియజేసింది. ఐఎస్‌కు వ్యతిరేకంగా పోరాడాలని సంకీర్ణ దేశాలు పిలుపునిచ్చినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఆ వార్తాసంస్థ తెలియజేసింది. ట్రక్కు దాడి జరిపింది తమ సైనికుడేనని కూడా ఐఎస్ స్పష్టం చేసింది. ప్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నీస్‌లో జరుగుతున్న వేడుకలను చూడడానికి వచ్చిన జనాన్ని ఓ ఉగ్రవాది ట్రక్కుతో తొక్కిస్తూ దాదాపు 2 కిలోమీటర్ల మేర నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 84 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. కాగా, దాడికి పాల్పడిన ఉగ్రవాదిని టునీసియా దేశస్థుడు 31 ఏళ్ల మహమ్మద్ లాహౌజ్ బౌహ్లెల్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఇతనికి జిహాదిస్టు ముఠాలతో సంబంధాలున్నట్లుగా ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. బౌహ్లెల్ క్షణికోద్రేకి, చిన్న చిన్న నేరాలకు పాల్పడే వ్యక్తిగా మాత్రమే తమకు తెలుసునని నీస్ శివార్లలోని క్వార్టైర్ డెస్ అబట్టోరియస్ ప్రాంతంలో అతను నివసించే అపార్ట్‌మెంట్ చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు.
టునీసియాలోని మసకెన్‌లో పుట్టిన అతను నాలుగేళ్ల క్రితం ఫ్రాన్స్‌కు వలస వచ్చాడని, చట్టబద్ధంగానే దేశంలో ఉంటున్నాడని తెలుస్తోంది. ముగ్గురు బిడ్డల తండ్రి అయిన బౌహ్లెల్ చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తి అని, మద్యం, మగువలు అలవాటు పడిన వాడని, తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. కోపం వచ్చినప్పుడు కంటికి కనిపించిన వస్తువునల్లా పగలకొట్టే వాడని, అతనికి సమస్య వచ్చిన ప్రతిసారీ తాము అతడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్లమని అతని తండ్రి మహమ్మద్ మొంధెర్ లాహౌజ్ బౌహెల్ చెప్పాడు. తన కుమారుడికి ఇస్లాం మత విశ్వాసాలపై నమ్మకం లేదని, నమాజ్ చేయడని, మసీదుకు వెళ్లేవాడు కాదని చివరికి రంజాన్ నెలలో ఉపవాసాలు చేసేవాడు కాదని ఆయన శుక్రవారం విలేఖరులకు చెప్పాడు.

చిత్రం.. నీస్ నగరంలో ట్రక్కు దాడిలో మృతిచెందిన వారి స్మృత్యర్థం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పూలగుచ్ఛాల మధ్య ఉంచిన టెడ్డీబేర్