అంతర్జాతీయం

మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 27: భారత్‌కు చెందిన రెండు మిగ్ యుద్ధ విమానాలను కూల్చివేసిన తరువాత, ఇద్దరు భారత పైలట్లను అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రకటించారు. అణ్వస్త్ర దేశాలయిన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, పాకిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దని ఆయన భారత్‌ను హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను సడలించడానికి చర్చలకు ముందుకు రావాలని ఆయన భారత్‌కు ప్రతిపాదించారు. ‘మీరు మా దేశంలోకి రాగలిగితే, మేము కూడా ఆ పని చేయగలమని చెప్పడమే మా చర్య ఉద్దేశం. వారి మిగ్ యుద్ధ విమానాలలో రెండింటిని కూల్చివేశాం. వారి పైలట్లు మా వద్ద ఉన్నారు’ అని ఖాన్ బుధవారం పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారమయింది. భారత్ చేసిన కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ బుధవారం భారత్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించిందని, వారి ప్రయత్నాలను భారత్ విజయవంతంగా భగ్నం చేసిందని, ఈ చర్యలో ఒక భారత్ పైలట్ అదృశ్యమయ్యాడని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఢిల్లీలో ప్రకటించిన కొద్ది నిమిషాలకే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అన్ని యుద్ధాలు కూడా ఆయా సమయాలు, యుద్ధంలో మానవులు చెల్లించాల్సిన మూల్యంపై తప్పుడు అంచనాలతోనే మొదలయ్యాయని ఖాన్ అన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, ఉగ్రవాదంపై యుద్ధంలోనూ ఇదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. యుద్ధాలు ఎక్కడికి దారి తీస్తాయనేది ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఇరు దేశాలు కూడా తెలివయిన చర్య తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ‘నేను భారత్‌ను అడుగుతున్నాను: మీవద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. మా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తప్పుడు అంచనాలను మనం తట్టుకోగలమా? ఈ (ఉద్రిక్త) పరిస్థితులు మరింత పెరిగితే, అప్పుడు పరిస్థితి నా చేతిలో కాని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో కాని ఉండదు’ అని ఖాన్ అన్నారు. ‘కలిసి కూర్చుం దాం, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ మంగళవారం ఉదయం దాడి చేసిన తరువాత తాను ఆర్మీ చీఫ్‌తో మాట్లాడానని, పాకిస్తాన్ తొందరపడి బదులివ్వలేదని ఆయన అన్నారు. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత తమ దర్యాప్తునకు సహకరించవలసిందిగా భారత్‌ను కోరడం జరిగిందని ఆయన చెప్పారు.