అంతర్జాతీయం

భారత్‌కు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు మద్దతు ఇస్తామని, ఉగ్రవాద నిర్మూలనకు అమెరికా అండదండలు ఉంటాయని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఆయన గురువారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ తో ఫోన్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారత్‌కు అమెరికా బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తాజా పరిస్థితిని డోవల్, పాంపియోకు వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీన కూడా పాంపియో , డోవల్‌తో మాట్లాడిన విషయం విదితమే. ఉగ్రవాద శిబిరాలకు ఆశ్రయంకల్పిస్తూ పాక్ తీసుకుంటున్న చర్యలను పాంపియో ఖండించారు. పాకిస్తాన్ కచ్చితంగా తన భూభాగాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మారకండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా నిర్మూలించాల్సిందేనని పాంపియో చెప్పారు. ఇరుదేశాలు సంయమనంతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
చర్చలే పరిష్కారం: అమెరికా దౌత్య నిపుణులు
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చర్చల వైపు దృష్టిని సారించడం మంచిదని అమెరికా రక్షణ రంగ, దౌత్య విభాగ నిపుణులంటున్నారు. రెండు దేశాల మధ్య అణ్వాయుధాలున్నాయి. కాభట్టి సంయమనం కోల్పోకుండా పాక్ వ్యవహరించాలంటున్నారు. ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ధ్వంసం చేయాల్సిందేనని రక్షణ రంగ నిపుణులు సూచించారు. అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ఎన్నికైన గబార్డ్ ఆనే హిందూ ప్రతినిధి మాట్లాడుతూ భారత్‌కు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసే హక్కు ఉందన్నారు. అదే సమయంలో దక్షిణాసియాలో శాంతి నెలకొనాలన్నారు. దౌత్యం ద్వారానే ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.