అంతర్జాతీయం

భారత పైలట్ విడుదలకు పాక్ అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: తమ భూ భాగంలోకి వచ్చి చిక్కిన భారత వైమానిక దళం పైలట్ విం గ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. శాంతికాముక చర్యలో
భాగంగానే తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్ ప్రధాని నరేంద్రమోదీతో చర్చలకు సిద్ధమేనని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషి ప్రకటన చేసిన గంట తర్వాత పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్ వర్ధమాన్ విడుదలపై ప్రకటన చేయడం ఆశ్చర్యపరిచింది. సభలో విపక్ష నేత షాబాద్ షరీఫ్ ప్రసంగిస్తున్నప్పుడు.. మధ్యలో జోక్యం చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ అంతరాయానికి చింతిస్తున్నానని.. పాక్ సైనికులకు చిక్కిన భారత వైమానిక పైలట్ అభినందన్ గురించి ఒక ప్రకటన చేయనున్నట్టు చెప్పారు. శాంతి చర్యల్లో భాగంగా తాము భారత పైలట్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఆయన ప్రకటనను హర్షిస్తూ సభలోని సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు విదేశాంగ మంత్రి ఖురేషి మాట్లాడుతూ తమకు పట్టుబడ్డ ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తే ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు సడలుతాయంటే తాము ఆయనను అప్పగించడానికి సిద్ధమేనని చెప్పారు. కాగా, బుధవారం ఆధీన రేఖవద్ద భారత్‌లో చొరబడటానికి పాకిస్తాన్‌కు చెందిన విమానాలు ప్రయత్నించిన నేపథ్యంలో దానిని తరుముతూ మిగ్ 21 ఫైటర్ జెట్‌పై పైలట్ అభినందన్ వెళ్లిన నేపథ్యంలో మిగ్ 21 కూలిపోగా, అభినందన్ పాక్ సైనికులకు చిక్కిన విషయం తెలిసిందే. తమ చేతికి ఇద్దరు భారత్ పైలట్‌లు చిక్కారని ప్రకటించిన పాకిస్తాన్ తర్వాత దానిని సవరిస్తూ కేవలం ఒక్క పైలట్ మాత్రమే తమ ఆధీనంలో ఉన్నాడని ప్రకటించింది. అభినందన్ తమ వద్ద సురక్షితంగా, క్షేమంగా ఉన్నాడని పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ (ఎఫ్‌ఓ) ప్రకటించింది. విమానం కూలిపోయినప్పుడు అందులోంచి కిందకు దూకిన అభినందన్‌ను స్థానికులు పట్టుకుని కొడుతుండగా, ఆర్మీ దళాలు రక్షించాయని ఎఫ్‌ఓ తెలిపింది. కాగా, పాక్ పట్టుకున్న పైలట్‌ను క్షేమంగా, సురక్షితంగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రభుత్వం పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు పంపింది. అతడికి ఎలాంటి హాని తలపెట్టరాదని పేర్కొంది. ఇలావుండగా గాయపడిన తమ పైలట్‌ను వీడియోలో చిత్రీకరించి ప్రదర్శించడం అంతర్జాతీయ మానవహక్కులకు విరుద్ధమని, ఇది జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.