అంతర్జాతీయం

భారత్, పాక్‌ను అణ్వస్త్ర దేశాలుగా గుర్తించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 1: భారత్, పాకిస్తాన్‌లు అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా తమ దేశం ఎప్పుడూ గుర్తించదని చైనా ప్రకటించింది. ఇదే వైఖరిని ఉత్తరకొరియా విషయంలో అనుసరిస్తున్నామన్నారు. ఈ విషయంలో తమ వైఖరిని మారదని ప్రకటించారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ మాట్లాడుతూ ఉత్తర కొరియాను అణ్వస్తద్రేశంగా గురిస్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ, గుర్తించదని ఆయన తెగేసి చెప్పారు. కాగా ట్రంప్, కిమ్ మధ్య హనోయ్‌లో జరిగిన చర్చలు విఫలం కావడంపై కూడా వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. న్యూక్లియార్ సప్లయర్స్ గ్రూప్‌లో చేర్చుకోవాలన్న భారత్ అభ్యర్థనను చైనా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ గ్రూప్‌లో ఇంతవరకు 47 దేశాలు ఉన్నాయి. 48వ దేశంగా తమను చేర్చుకోవాలని భారత్ చాలా సంవత్సరాల నుంచి కోరుతోంది. న్యూఢిల్లీ ఇంతవరకు అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయలేదని చైనా గుర్తు చేసింది. పాకిస్తాన్ కూడా ఈ గ్రూపులో చేర్చుకోవాలని కోరుకుంటున్న విషయం విదితమే.