అంతర్జాతీయం

ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 1: పాకిస్తాన్ తన గడ్డమీద ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వొద్దని, వారికి నిధుల సరఫరాను అడ్డుకోవాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఈ రెండు చర్యలు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్.. ఐక్యరాజ్య సమితి (ఐరా స) భద్రతా మండలికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ తనకు పట్టుబడిన భారత వాయుసేన పైలట్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. గురువారం పాకిస్తాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడు తూ శాంతికి సూచకంగా అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

‘పాకిస్తాన్ అదుపులో ఉన్న భారత పైలట్‌ను విడుదల చేయాలని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను సడలించేందుకు ఇరు దేశాలు వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. ‘్భరత్, పాకిస్తాన్‌లు నేరుగా సంప్రదింపులు జరుపుకోవడం సహా తక్షణమే చర్యలు తీసుకొని పరిస్థితుల్లో ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా ఇరు దేశాలను కోరుతోంది. సైనిక కార్యకలాపాలు ఇంకా కొనసాగితే పరిస్థితుల్లో ఉద్రిక్తత మరింత పెరుగుతుంది’ అని ఆ అధికార ప్రతినిధి ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.