అంతర్జాతీయం

తిరుగుబాటుకు కారణమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ ప్రపంచంలో ఎంతో ఉన్నతభావాలు కలిగిన ఉదారవాద దేశంగా ఉన్న టర్కీలో సైనిక తిరుగుబాటు జరగడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురి చేసింది. అధ్యక్షుడు ఎర్డోగన్ వ్యవహార శైలే ఇందుకు కారణమనే అభిప్రాయం ఉంది. కొంతకాలంగా టర్కీలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. 1920లో ముస్త్ఫా కెమాల్ పాషా టర్కీని లౌకిక రాజ్యంగా ప్రకటించారు. నేటి నూతన టర్కీ నిర్మాణంకోసం విశేషంగా కృషి చేశారు. అందుకే ఆయనను ఆధునిక టర్కీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఆయన కృషి ఫలితంగానే టర్కీ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డొగన్ లౌకిక వాదం, ప్రజాస్వామ్యాలకు విఘాతం కలుగుతోందని సైన్యంలో ఒక వర్గం భావిస్తోంది. సైన్యం అధికారాలను కుదించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు సైతం వారిలో అసంతృప్తికి ఆజ్యం పోశాయి. సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధం విషయంలో ఎర్డోగన్ జోక్యం చేసుకోవడం ప్రజల్లో అసంతృప్తి తలెత్తడానికి కారణమైంది.
ఎర్డోగన్‌కు నాటో దేశాల మద్దతు
టర్కీలో జరిగిన తిరుగుబాటును నాటోకు చెందిన దాని మిత్ర దేశాలన్నీ ఖండించాయి. టర్కీలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్ని పక్షాల వారికి విజ్ఞప్తి చేశారు. తాను టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కవుసోగ్లుతో ఫోన్‌లో మాట్లాడాననని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని పిలుపునిచ్చినట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ చెప్పారు.
ప్రజలే సైనికులు
తిరుగుబాటు మొదలైనప్పుడు ఎర్డోగన్ ఓ బీచ్ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ట్యాంకులు దేశ రాజధాని అంకారా, ముఖ్య నగరం ఇస్తాంబుల్ వీధుల్లోకి వచ్చినట్లు తెలియగానే ఆయన హుటాహుటిన బయలుదేరి రావడమే కాకుండా తిరుగుబాటు చేసిన సైన్యంపై తిరగబడమని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్ ద్వారా టీవీలో కనిపించిన ఎర్డోగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని తన మద్దతుదారులకు ఇచ్చిన పిలుపునకు జనం సైతం భారీగా స్పందించారు. జనం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ట్యాంకులతో రోడ్లపైకి వచ్చిన తిరుగుబాటుదారులను ప్రతిఘటించారు. అంతేకాకుండా జనంపైనుంచే వారు ట్యాంకులను నడిపి తొక్కేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. సైనిక వాహనాలకు అడ్డంగా పడుకోవడమే కాకుండా వారితో ఘర్షణలకు దిగారు. శనివారం తెల్లవారే దాకా కూడా కొన్ని గంటల పాటు టర్కీలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తెల్లవారే సమయానికి తిరుగుబాటు ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.