అంతర్జాతీయం

భవిష్యత్తులో చర్చలు ఆశాజనకంగా ఉంటాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయ్, మార్చి 1: హనోయ్ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఉత్తర కొరియా చర్చలు విఫలమయ్యాయి. కాని ఈ చర్చలు భవిష్యత్తులో జయప్రదమయ్యేందుకు తగిన కృషి చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ చర్చలు విజయవంతమయ్యేందుకు వీలుగా తగిన దిశ, దశ మార్గనిర్దేశనం చేసేందుకు ఇప్పటి నుంచి కసరత్తును ప్రారంభిస్తామని ఉత్తర కొరియా పేర్కొంది. హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి విదితమే. గత ఏడాది జూన్‌లో సింగపూర్‌లో ఇరువురు నేతల మధ్య తొలి సారి చర్చలు జరిగాయి. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అణ్వాయుధాలను ఉత్తర కొరియా త్యజించిన పక్షంలో ఆంక్షలు ఎత్తివేస్తామని, ఆర్థికంగా ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. కాని ముందు ఆంక్షలు ఎత్తివేయాలని, తమకు నమ్మకమైన వాతావరణం కల్పించాలని కిమ్ పట్టుబడుతున్నారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ చర్చలపై ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పం కంటే, సరైన దిశలో చర్చలను ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తానున్నట్లు చెప్పారు. హనోయ్ చర్చల్లో మంచి ఫలితాలు కనపడుతాయని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఐక్యరాజ్యసమితి విధించిన అన్ని ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలని ఉత్తర కొరియా ప్రతినిధులు ఈ చర్చల్లో పట్టుబట్టారు. దీంతో చర్చలు ముందుకు సాగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారయ్యాయి. దీంతో ట్రంప్ సమావేశం నుంచి నిష్క్రమించారని అమెరికా దౌత్యవర్గాలు తెలిపాయి. వీలైనంత త్వరలో ఈ చర్చలు మళ్లీ జరిగేటట్లు అన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో చెప్పారు.