అంతర్జాతీయం

అది మామీద దాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 1: భారత్ చేసిన కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్‌ను పాకిస్తాన్ మీద జరిపిన దాడిగా ఆ దేశం అభివర్ణించింది. పైగా పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం శుక్రవారం దీనిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషి ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఖురేషి తాను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఈ సమావేశానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను ఆహ్వానించినందునే తాను సమావేశానికి హాజరు కావడం లేదని ఖురేషి పేర్కొన్నారు. భారత యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారు జామున పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరంపై బాంబులు వేశాయి. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు, వారి శిక్షకులు, సీనియర్ కమాండర్లు ఆత్మాహుతి దాడుల కోసం శిక్షణ పొందుతున్న జిహాదీ బృందాల్లోని ఉగ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారు. భారత్ తన స్వార్థం కోసం ఇతరుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ దాడికి దిగిందని పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఆమోదించిన తీర్మానం పేర్కొంది. ఉగ్రవాదుల శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేశానని, ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారని భార త్ చేసిన ప్రకటన అవాస్తవమని కూడా ఈ తీర్మానం పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు భారత్ చేసిన ప్రకటన తప్పని నిరూపిస్తున్నాయని తెలిపింది. స్వతంత్ర పరిశీలకులు కూడా భారత్‌వాదన తప్పని నిరూపించారని పేర్కొంది. భారత్ చేసిన దాడికి పాకిస్తాన్ వాయుసేన సకాలంలో స్పందించి, ప్రాణనష్టం జరుగకుండా సమర్థవంతంగా బదులిచ్చిందని ఆ తీర్మానం పేర్కొంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిపై దర్యాప్తుకు భారత్‌కు సహకరిస్తానని పాకిస్తాన్ సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని తీర్మానం గుర్తుచేసింది. భారత్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఫిబ్రవరి 26,27 తేదీ ల్లో చేసిన దాడులు దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాలకు ముప్పుగా పరిణమించాయని పాకిస్తాన్ పార్లమెంటు తన తీర్మానంలో పేర్కొంది.