అంతర్జాతీయం

భారత సంతతికి చెందిన వ్యక్తికి 33 నెలల ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ఒక మెడికల్ కంపెనీకి చెందిన నిధులను తప్పుడు ఈమెయిల్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి 33 నెలల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా 2.6 మిలియన్ డాలర్ల అపరాధ రుసుం చెల్లించాలని 41 ఏళ్ల దినేష్ శంకర్ అనే వ్యక్తిని కాలిఫోర్నియాలోని శాన్ జోస్ కోర్టు ఆదేశించింది. నిందితుడు దినేష్ శంకర్ 2013 మార్చి నుంచి 2018 జనవరి వరకు మెడికల్ డివైస్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నాడు. అయితే, 2013 జూలై నుంచి 2017 డిసెంబర్ వరకు తప్పుడు ఈమెయిల్స్ ద్వారా కంపెనీ ఆర్థిక వ్యవహారా శాఖను మోసగించడంతోపాటు కంపెనీకి అర మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లేందుకు కారకుడయ్యాడు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు స్వయంగా నిందితుడు దినేష్ శంకర్ అంగీకరించడంతో అతనికి కోర్టు 33 నెలల జైలు శిక్ష, 2.6 మిలియన్ డాలర్ల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించింది.