అంతర్జాతీయం

భారత్ దాడి ఏకపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 5: పుల్వామా ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాలపై భారత్ తానే న్యాయమూర్తిగా వ్యవహరిస్తోందని అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేస్తున్న అసద్ మజీద్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో ఎటువంటి వ్యవస్థీకృత ఉగ్రవాద సంస్థ పనిచేయడం లేదని ఆయన చెప్పారు. పుల్వామాలో ఉగ్రవాద దాడి, 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల అమరులైన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులను నిర్వహించిన సంగతి విదితమే. ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులను నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను చంపామని భారత్ చెప్పుకుంటోందని, తానే న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఖాన్ చెప్పారు. తటస్థ పరిశీలకులు కూడా ఈ దాడి, ఉగ్రవాదుల హతం కావడాన్ని తోసిపుచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తతగా ఉన్నట్లు చెప్పారు. భారత్‌తో చర్చల ద్వారా శాంతిని కోరుకుంటున్నట్లు ఆయనచెప్పారు. తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారన్నారు. నిరంతరం చర్చలు, సంభాషణల ద్వారా మాత్రమే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను సడలించవచ్చన్నారు. తమ దేశ భూభాగం మీది నుంచి ఏ ఉగ్రవాద సంస్థకూడా పని చేయడం లేదన్నారు. పుల్వామా దాడి జరిగిన వెంటనే పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు రుజువులు తమ దేశానికి సమర్పించాల్సి ఉందన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భారత్ ప్రభుత్వంతో పాటు మీడియా కూడా పాకిస్తాన్‌ను నిందించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. తమదేశం కేంద్రంగా ఉగ్రవాద దాడికి పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మా భూభాగంలోకి వచ్చిన రెండు భారత్ విమానాలను కూల్చివేసినట్లు చెప్పారు. మా దేశాన్ని రక్షించుకునే ఆత్మస్థైర్యం తమకు ఉందని, ఇది తమ హక్కు అన్నారు. ఉద్రిక్తతలు కొనసాగకుండా చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.