అంతర్జాతీయం

రక్షణ శాఖ బడ్జెట్‌ను పెంచిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 5: ప్రపంచంలో సాయుధ బలగాల కోసం దేశ బడ్జెట్‌లో అత్యంత ఎక్కువగా వెచ్చిస్తున్న ప్రథమ దేశంగా అమెరికా నిలుస్తుండగా, ఆ తర్వాత స్థానాన్ని ఇపుడు చైనా ఆక్రమించింది. చైనా తన దేశ వార్షిక బడ్జెట్‌లో తాజాగా అత్యధిక శాతం నిధులను వెచ్చించనున్నట్టు వెల్లడించింది. మంగళవారం ప్రకటించిన ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో 7.5 శాతం నిధులు అంటే 177.61 బిలియన్ అమెరికా డాలర్లు కేటాయించనున్నట్టు చైనా వెల్లడించింది. చైనా పార్లమెంటులో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) మంగళవారం చైనీస్ ప్రీమియర్ లీ కెక్వియాంగ్ మంగళవారం ఉదయం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సమావేశంలో 2019 సంవత్సరానికిగాను 1.19 ట్రిలియన్ యుయాన్లు (177.61 బిలియన్ల అమెరికా డాలర్లు) మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని సభ ముందు ప్రవేశపెట్టారు. గత ఏడాది సాయుధ బలగాల కోసం 8.1 శాతం అంటే 175 బిలియన్ల అమెరికా డాలర్లు కేటాయించిన చైనా ఇపుడు బడ్జెట్‌లో 7.5 శాతం అత్యధికంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది రక్షణ శాఖ కోసం 1.11 ట్రిలియన్ యుయాన్లు మాత్రమే చైనా కేటాయించింది. 2015 నాటి దేశ వార్షిక బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయించిన నిధులతో పోల్చుకుంటే ఈ ఏడాది రెట్టింపు నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించింది. 2016 నాటి వార్షిక బడ్జెట్‌లో సాయుధ బలగాల కోసం చైనా 7.6 శాతం నిధులను కేటాయించగా, 2017 వార్షిక బడ్జెట్‌లో 8.1 శాతం వరకు పెంచింది. 2010 వార్షిక బడ్జెట్ నుంచి ఏటా తమ దేశంలోని రక్షణ శాఖ కోసం కేటాయిస్తున్న నిధుల్లో కేటాయింపులు పెంచుతూ వస్తోంది. ఇదిలావుండగా, ప్రపంచంలోనే రక్షణ వ్యవహారాల శాఖకు 200 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా కేటాయిస్తుండగా, దాదాపు అంతే మొత్తం రక్షణ శాఖకు కేటాయించేందుకు చేరువవుతున్నట్టు చైనా చెబుతోంది. ఇదిలావుండగా, రక్షణ శాఖకు భారత్ ఈ ఏడాది ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో 6.87 శాతం నిధులను పెంచింది. అంటే 3.18 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇదే గత ఏడాది బడ్జెట్‌లో 2.98 లక్షల కోట్ల రూపాయల నిధులను భారత్ కేటాయింపులు జరిపింది.