అంతర్జాతీయం

పాక్‌కు వీసా నిబంధనల్లో అమెరికా మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 6: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల నుంచి విమర్శలు, మొట్టికాయలు తింటున్న పాకిస్తాన్‌కు ఇపుడు మరింత దెబ్బ తగిలింది. వీసాల రూపంలో ఇప్పటివరకు పాక్ పౌరులకు వివిధ రూపాల్లో అందజేస్తున్న పరిమితులను అగ్ర దేశం అమెరికా మరింత కఠినతరం చేసింది. పాకిస్తాన్ పౌరులకు ఇప్పటివరకు ఉన్న వీసా నిబంధనల్లో భారీ మార్పులు చేస్తూ అమెరికా తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ పౌరులకు ఇప్పటివరకు అమెరికా వీసాలను ఐదేళ్ల కాలం నుంచి ఏడాదికి తగ్గించింది. పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా విడుదల చేసిన తన అధికారిక నోటిఫికేషన్‌తో పాక్‌కు వీసా నిబంధనల్లో గట్టి దెబ్బ తగిలినట్టే. అమెరికాలో హెచ్ (తాత్కాలికంగా పనిచేసే వీసా), ఐ (జర్నలిస్టులు, మీడియా), ఎల్ (సంస్థ అంతర్గత బదిలీ వీసా), ఆర్ (మతపరంగా పనిచేసే వీసా)లను మరింత కఠినతరం చేసింది. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ అనే పత్రిక వెల్లడించింది. పాకిస్తాన్ పౌరులకు ఇప్పటివరకు ఉన్న ఐదేళ్ల వీసా కాలపరిమితిని ఏడాదికి తగ్గించింది. అదేవిధంగా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు అమెరికాలో పర్యాటక అనుమతిపై వచ్చే వీసాను మూడు నెలలకు కుదించింది. ఈ కాలపరిమితిని మూడు నెలల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ రెన్యువల్ చేయబోమని పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అదేవిధంగా ఎల్ వీసాకు ఇప్పటివరకు చెల్లిస్తున్న ఫీజును 32 అమెరికా డాలర్ల నుంచి 38 డాలర్ల మేరకు పెంచింది. ఈ నిర్ణయం అన్ని విభాగాల్లో వీసా పొందే పాక్ పౌరులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ సైతం ఇటీవల వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికావాసులకు ఇచ్చే వీసా నిబంధనల్లో భారీగా మార్పులు చేసింది. అమెరికా జర్నలిస్టులకు సైతం పర్యాటక వీసాలను మూడు నెలలకు పాక్ కుదించింది. అందుకు ప్రతిగా ఇపుడు అగ్రరాజ్యం పాక్ పౌరులకు వివిధ రకాలుగా అందించే వీసాల్లో నిబంధనలు మార్చేందుకు, వీసా ఫీజులు పెంచేందుకు వీలుగా తాజా నిర్ణయం తీసుకుంది.