అంతర్జాతీయం

బాలీలో నిశ్శబ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెన్‌పాసర్, మార్చి 6: ఒక రోజంతా నిశ్శబ్దంలో జీవిస్తే ఎలా వుంటుం ది.. ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.. అలాంటి అనుభూతిని పొందాలంటే ఇండొనేసియాకు వెళ్లాల్సిందే. కొత్త సంవత్సరం సందర్భంగా ఇండొనేసియాలో 24 గంటల పాటు నిశ్శబ్దం అలముకుంటుంది. బాలీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయడంతోపాటు అంతర్జాల సేవలన్నీ నిలిపివేస్తారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ‘నైపీ’ పేరుతో ప్రజలంతా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. టీవీ, రేడియోలు ప్రసారాల్ని నిలిపివేస్తాయి. ఈ సంప్రదాయానికి ఫోన్ కంపెనీలు సహకరించడంతో వరుసగా రెండో సంవత్సరం కూడా 24 గంటలపాటు తమ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నాయి. ఈ హిందూదేశంలో దాదాపు 4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. కొత్త సంవత్సరం రోజున ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. దర్వాజాలు, కిటికీలు మూసేస్తారు.. లైట్లు వేయరు.. అలా రోజంతా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కొత్త సంవత్సరం రోజు పూర్తి నిశ్శబ్దాన్ని పాటించి స్వచ్ఛమైన మనస్సుతో మళ్లీ కొత్త సంవత్సరం ప్రారంభిస్తామని క్యుటాలోని ఓ హోటల్ నిర్వాహకుడు వాయన్ గోటా తెలిపారు. అయితే ‘నైపీ’ ప్రారంభానికి ముందు రాత్రంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. చెడుపై సాధించిన విజయానికి చిహ్నంగా ‘ఓఘో-ఓఘో’ పేరుతో పెద్ద పెద్ద ఊరేగింపులు నిర్వహిస్తారు.