అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో తెలంగాణ డెంటిస్ట్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 6: ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ భారతీయ డెంటిస్టు ప్రీతిరెడ్డి హత్యకు గురికావడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేగింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన నరసింహ్మరెడ్డి 1995లో ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న సిడ్నీలో అదృశ్యమైన ప్రీతిరెడ్డి ఈ నెల 5వతేదిన తనకారులోనే సూటికేసులో మృతదేహం కనిపించడం, ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియాలో హత్యకు గురైన ప్రీతిరెడ్డి ప్రియుడే ఈ హత్యచేసినట్లు కూడా అక్కడి పోలీసులు నిర్థారించినట్లు తెలుస్తుంది. అయితే హత్యకు పాల్పడ్డ ప్రియుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సిడ్నికి 70కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్లెన్‌బ్రూక్ డెంటల్ ఆసుపత్రిలో సర్జన్‌గా ప్రితీరెడ్డి పనిచేస్తుంది. ఆదివారం బసచేసిన హోటల్ నుండి అదృశ్యం కావడం, రెండురోజుల తర్వాత తన కారులో మృతదేహం లభించడం ఈ విషయం అక్కడి పోలీసులు ప్రితీరెడ్డి తండ్రి నరసింహ్మరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన బుధవారం ఉదయం తన సోదరులకు ఫోన్ ద్వారా ఇక్కడికి సమాచారం అందించారు. అయితే ప్రితీరెడ్డి చిన్నతనంలోనే ఆమె తండ్రి నరసింహ్మరెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. ఆయన సైంటిస్టు కావడంతో అక్కడే స్థిరపడ్డారు. నరసింహ్మరెడ్డి సోదరుడు దామోదర్‌రెడ్డి కూతురు వివాహం గతేడాది డిసెంబర్ 27న హైదరాబాద్‌లో జరగడంతో ఆ పెళ్లికి ప్రితీరెడ్డితో పాటు కుటుంబసభ్యులు హజరయ్యారు. పెళ్లి తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లి పోయారు. ఇంతలోపే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం ప్రీతిరెడ్డి స్వగ్రామమైన గురుకుంటలో తెలియడంతో గ్రామస్థులంతా తీవ్రదిగ్బ్రంతిని వ్యక్తం చేశారు. ప్రితీరెడ్డి రెండవ చిన్నాన్న రిటైర్డు విఆర్‌ఓ యాదగిరిరెడ్డికి సమాచారం తెలియడంతో ఆయన బుధవారం మహబూబ్‌నగర్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా గురుకుంట గ్రామం లో ప్రితీరెడ్డి రెండవ తరగతి వరకు చదివినట్లు గ్రామస్థులు తెలిపారు. నరసింహ్మరెడ్డి కుటుంబం 1995లోనే గ్రామం నుండి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు కూడా గ్రామస్థులు తెలిపారు. నరసింహ్మరెడ్డి, రేణుక దంపతులకు ఇద్దరు కూతురుల్లే. అందులో పెద్ద కూతురు ప్రితీరెడ్డి, రెండవ నిత్యారెడ్డిలు. ప్రితీరెడ్డి తండ్రి నరసింహ్మరెడ్డికి మాత్రం ముగ్గురు తమ్ముళ్లు ఉండగా అందు లో మొదటి తమ్ముడు యాదగిరిరెడ్డి విఆర్‌ఓగా రిటైర్డు అయ్యి మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఈయన అప్పుడప్పుడు స్వగ్రామం గురుకుంటకు వెళ్లి వస్తుంటారు. రెండవ తమ్ముడు దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా ఈయన కూడా అప్పుడప్పుడు గురుకుంట గ్రామానికి వస్తుంటారని గ్రామస్థులు తెలిపారు. మూడవ తమ్ముడు హరికృష్ణరెడ్డిలు మాత్రం యూఎస్‌లో ఉంటున్నారు. కాగా ప్రితీరెడ్డి కుటుంబసభ్యులు కూడా రెండుమూడేళ్ల కోసారి స్వగ్రామమైన గురుకుంటకు వచ్చిపోయేవారని గ్రామస్థులు వెల్లడించారు.