అంతర్జాతీయం

ఇజ్రాయిల్ కాల్పుల్లో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజా సిటీ, మార్చి 7: గాజా సరిహద్దులో ఇజ్రాయిల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక పాలస్తీనియన్ యువకుడు మృతి చెందినట్టు గురువారం ఇజ్రాయిల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల గాజా సరిహద్దులో చెలరేగిన అల్లర్ల వల్ల తమ దళాలు కాల్పులు జరిపిందని, ఆ కాల్పుల్లో గాజా నగరం తూర్పు ప్రాంతంలో ఆల్-దిన్ అబుజీద్ (15) అనే యువకుడు గాయపడి మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఆషఫ్ ఆల్ ఖ్వాద్రా గురువారం తెలిపారు. సరిహద్దు వద్ద వందలాది మంది ఆందోళనకారులు రాళ్లు, పేలుడు పదార్థాలతో తమ దేశ భద్రతా దళాలపై దాడులకు దిగాయని, దాంతో తమ సైనికులు ఎదురుకాల్పులు జరపగా ఒక యువకుడు మృతి చెందాడని ఇజ్రాయిల్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తొలుత గాజా నుంచి ఇజ్రాయిల్ ప్రాంతంపై పేలుడు పదార్థాలతో కూడిన బెలూన్ల ద్వారా దాడి జరిగింది. దీంతో దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ఇస్లామిక్ గ్రూప్‌కు చెందిన హమాస్ స్థావరాలపై దాడులు నిర్వహించాయి. కాగా గతంలో చేసుకున్న ఒప్పందాన్ని విరమించారంటూ అటు ఇజ్రాయిల్, ఇటు హమస్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇస్లామిస్టుల హమాస్ ఆధీనంలో 2007 నుంచి గాజా ఉంది. దీని నిమిత్తం వారు ఇజ్రాయిల్‌తో మూడుసార్లు యుద్ధం కూడా చేశారు.