అంతర్జాతీయం

పాక్ మాకు వ్యూహాత్మక భాగస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్/ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తొలగించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని పైకి చెబుతూ చైనా తన మిత్రదేశంపై ప్రశంసలు కురిపించింది. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పాక్ ఉగ్రవాదులపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిపోయింది. ఈ దశలో పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే చైనా నిగ్రహం పాటించాలని హితబోధలు మొదలెట్టింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడానికి ఐరాస ఓ ప్రయత్నాలు చేస్తోంది. ఈనెల 13న లోగా తమ అభిప్రాయాలు తెలపాలని సభ్యదేశాలకు ఐరాస భద్రతా మండలి విజ్ఞప్తి చేసింది. ఈనేపథ్యంలో చైనా సన్నాయి నొక్కులు నొక్కడం మొదలెట్టింది. దీనిలో చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాంగ్ జిన్‌హ్యూను బుధవారం ఇస్లామాబాద్ పంపించింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపటామని పైకి చెబుతున్నా జరుగుతున్నది వేరుగా ఉంది. అదే విషయం గురువారం బయటపెట్టింది. ఇస్లామాబాద్ వెళ్లిన కాంగ్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ, విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జంజ్వాతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరినట్టు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ గురువారం బీజింగ్‌లో చెప్పుకొచ్చారు. ‘పాక్ మాకు వ్యూహాత్మక భాగస్వామి’ అంటూ చైనా పేర్కొంది. చైనా తమకు మిత్రదేశమని ఇరువురం అనేక అంశాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నట్టు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించడం కూడా గమనార్హం. ‘భారత్‌లో తలెత్తిన అన్ని సమస్యలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని పాక్ భావిస్తోంది. ఇదే విషయాన్ని తమ విదేశాంగ మంత్రితోనూ చెప్పారు. అలాగే మేం తీసుకున్న చొరవకు పాక్ కృతజ్ఞతలు తెలిపింది’అని లూ కాంగ్ చెప్పుకొచ్చారు. పాక్‌లో సుస్థిరత, శాంతి నెలకొనాలన్నదే చైనా ఉద్దేశమని, ఆ దిశగా తాము ప్రయత్నాలు చేస్తూ మద్దతు తెలుపుతున్నట్టు బీజింగ్ ప్రకటించింది. పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోడానికి అన్ని దశల్లోనూ ప్రయత్నాలు కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని కాంగ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా పాకిస్తాన్ ఆలోచిస్తోందని చైనా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడాన్ని తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తొలగించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను పాక్ ప్రశసించిందని చైనా వెల్లడించింది. భారత్‌తో తలెత్తిన సమస్యలు పాకిస్తానే సొంతంగా పరిష్కరించుకుంటుందన్న ఆశాభావం కాంగ్ వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదంతో సహా అనేక అంశాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. సంతృప్తికరంగా ముగిశాయి’అని చైనా ప్రకటించింది.