అంతర్జాతీయం

గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మా లక్ష్మి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, మార్చి 8: భారత్-అమెరికా టెలివిజన్ పర్సనాలిటీ, ఆహార నిపుణురాలు పద్మా లక్ష్మి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియతులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వివక్ష, అసమానతలపై జరిగే పోరాటానికి మద్దతు పలికే సంస్థకు కొత్తగా గుడ్‌విల్ అంబాసిడర్‌గా పద్మా లక్ష్మికి నియమిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) ప్రకటించింది. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పద్మా లక్ష్మి నియామకాన్ని ప్రకటించినట్టు యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టీయినెర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న వివక్ష, అసమానతలపై జరిగే పోరాటానికి మద్దతు నిలిచే సంస్థకు పూర్తి సహకారాన్ని అందించేందుకు పద్మా లక్ష్మి తన వంతు కృషి చేయనున్నారు. ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు అనేక రకాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై పోరాడేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని తన గుడ్‌విల్ అంబాసిడర్‌గా తనను నియమించిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పద్మా లక్ష్మి పేర్కొన్నారు. చాలా దేశాల్లో పేదరికం బాగా తగ్గిందని, కానీ మహిళలు, బాలికల పట్ల వివక్ష, అసమానతలు, వేధింపులు, ఇబ్బందులు వంటివి నిరంతరం కొనసాగుతున్నాయని, వీటిన్నింటికీ వ్యతిరేకంగా జరిపే పోరాటానికి తన సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.