అంతర్జాతీయం

యుద్ధ నేరాల కింద ముగ్గురికి మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 18: బంగ్లాదేశ్ యుద్ధ నేరాల కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించారు. మరో ఐదుగురికి యావజ్జీవ శిక్ష పడింది. 1971 పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛకోరుతూ జరిగిన యుద్ధంలో అల్ బదర్ ఇస్లామిక్ దళానికి చెందిన వీరంతా దేశద్రోహానికి పాల్పడ్డారు. అదే సంస్థకు చెందిన ముగ్గురికి మరణశిక్ష, ఐదుగురికి జీవించి ఉన్నంతకాలం జైలులోనే ఉండాలంటూ అంతర్జాతీయ క్రైం ట్రిబ్యునల్ త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. జస్టిస్ అన్వరూల్ హక్ సారధ్యంలోని బెంచ్ ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది. ముద్దాయిల్లో ఇద్దరు సోమవారం కోర్టుకు హాజరుకాగా మిగతావారు గైర్హాజరయ్యారు. ఈ ఎనిమిది మంది సామూహిక హత్యాకాండ, కిడ్నాప్‌లు, లూటీలకు పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అల్ బదర్ అనే మిలిటెంట్ సంస్థ పాకిస్తాన్ సైనిక దళాలకు అనుబంధంగా పనిచేసిందని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది చెప్పారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా అనేక అరాచకాలకు పాల్పడ్డారని, ముఖ్యంగా ఉత్తర జమల్‌పూర్ జిల్లాలో అల్‌బకర్ దురాఘతాలు అడ్డూఅదుపూ లేకుండా సాగిందని అన్నారు. ఇస్లామిక్ ఛాందస సంస్థ జమాతే ఇస్లామీ 1971నాటి బంగ్లా స్వాతంత్య్ర పోరాటాన్ని వ్యతిరేకించింది. అల్‌బదర్ దళం అయితే ఏకంగా పాకిస్తాన్ సైన్యానికి మద్దతుగా పనిచేసింది.

చిత్రాలు..కోర్టు తీర్పు అనంతరం పోలీసుల అదుపులో ఎస్.ఎం. యూసుఫ్ అలీ. షంషూల్ హక్