అంతర్జాతీయం

బ్రెగ్జిట్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 13: మరో 17 రోజుల్లో ఐరో పా యూనియన్ నుంచి వైదొలగడానికి సంబంధించిన డెడ్‌లైన్ పూర్తవుతున్న తరుణంలో బ్రిటన్ ప్రధాని థెరిస్సామే మరో తీవ్ర విఘాతాన్ని ఎదుర్కొన్నారు. ఐరోపా యూనియన్ నుంచి తప్పుకునేందుకు ఆమె ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ప్రతిపాదనలను బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. దీంతో యూనైటెడ్ కింగ్‌డమ్‌లో రాజకీయ అనిశ్చితి మరింత క్షీణించింది. తన బ్రెగ్జిట్ ప్రతిపాదనలకు సంబంధించిన ముసాయిదాను ఆమోదించాలని లేని పక్షంలో తీవ్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయన్న థెరిస్సామే హెచ్చరికలను సైతం బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఖాతరు చేయలేదు. ఈ ప్రతిపాదనపై జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా 391ఓట్లు, అనుకూలంగా 242 ఓట్లు వచ్చాయి. మరింతగా బ్రిటన్‌కు ఐరోపా యూనియన్ రాయితీలు కల్పిస్తుందంటూ పార్లమెంట్ సభ్యులను ఒప్పించేందుకు ప్రధాని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ వాదనంతా కూడా పసలేనిదేనని, కేవలం బ్రిటన్ ప్రజలను ఒప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేనని ఎంపీలు వ్యాఖ్యానించారు. గత జనవరిలో కూడా థెరిస్సామే ఇదే రకమైన వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో 230 ఓట్ల తేడాతో ఆమె ప్రతిపాదనలు వీగిపోయిన నేపథ్యంలో తాజా వైఫల్య తీవ్రత తక్కువేనని విశే్లషకులు భావిస్తున్నారు. జనవరి వైఫల్యం నాటినుంచి తనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకునేందుకు బ్రిటన్‌కు లబ్ది చేకూర్చేవిధంగా ఐరోపా యూనియన్‌ను ఒప్పించేందుకు థెరిస్సామే చేసిన ప్రయత్నమేదీ ఎంపీలను ఆకట్టుకోలేదని చెప్పడానికి ఈ వైఫల్యమే నిదర్శనం. తాజా ఓటింగ్ సంబంధించి అధికార కన్సర్‌వేటివ్ పార్టీ ఎంపీలకు ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అయినప్పటికీ కూడా ఆమె అనుకున్న మేర ఫలితం రాలేదు. ఈ తాజా వైఫల్యంతో బ్రెగ్జిట్‌కు సంబంధించి గురువారం నాడు మరోసారి ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే మార్చి 29లోగా ముగియనున్న ఈ గడువును రేపు జరిగే ఓటింగ్ ద్వారా పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ బ్రెగ్జిట్ గడువును పెంచాలని బ్రిటన్ పార్లమెంట్ నిర్ణయిస్తే దాన్ని ఐరోపా యూనియన్ ధృవీకరించాల్సి ఉంటుంది.