అంతర్జాతీయం

మళ్లీ అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 13: కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని వచ్చిన ప్రతిపాదనపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఆ చర్యను మరోసారి అడ్డుకుంటానని చైనా బుధవారం సంకేత ప్రాయంగా వెల్లడించింది. ‘అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమయిన పరిష్కారం మాత్రమే సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది’ అని చైనా వ్యాఖ్యానించింది. ఐరాస భద్రతా మండలి మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఉద్దేశించిన ప్రతిపాదన భవితవ్యం 24 గంటలలోపు తేలనుంది. ఎందుకంటే ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ఇచ్చిన గడువు 24 గంటలలోపు ముగియబోతోంది. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఫిబ్రవరి 27వ తేదీన మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఒక ప్రతిపాదనను ఐరాస భద్రతా మండలిలోని 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీకి సమర్పించాయి. ‘చైనా తాను అనుసరిస్తున్న బాధ్యతాయుతమయిన వైఖరిని కొనసాగిస్తుందని, ఐరాస భద్రతా మండలి 1267 కమిటీలో చర్చలలో పాల్గొంటుందని నేను పునరుద్ఘాటించగలను’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో చెప్పారు. ఐరాస భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యురాలయిన చైనా గతంలో మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్, ఇతర సభ్యదేశాలు చేసిన ప్రతిపాదనను మూడుసార్లు అడ్డుకుంది. పరిష్కారం అనేది అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని చైనా మొదటినుంచీ నొక్కి చెబుతూ వస్తోంది. మార్చి 13వ తేదీన చర్చించనున్న అంశాల జాబితాలో ఈ అంశాన్ని చేర్చారా?, చైనా సంబంధిత అన్ని పక్షాలతో సంప్రదింపులు జరుపుతోందా? అని ప్రశ్నించగా, ‘తొలుత నేనొక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. ఐరాస భద్రతా మండలి, ఇతర ఐరాస అనుబంధ సంస్థలు ఇచ్చిన గడువులకు సంబంధించిన దేనినీ నేను తిరిగి గుర్తుచేయబోను’ అని లు కాంగ్ బదులిచ్చారు.