అంతర్జాతీయం

పాక్‌పై మరింత ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 13: ఉగ్రవాదం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికా లు పాకిస్తాన్‌ను కోరాయి. సరిహద్దు చొరబాట్లను నిలుపుదల చేయాలని కోరాయి. బుధవారం ఇక్కడ భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌గోఖలే, అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ కార్యదర్శి డేవిడ్ హాలేతో ఉగ్రవాదం నిర్మూలనపై చర్చించారు. అనంతరం ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. పుల్వామా వద్ద ఉగ్రవాద దాడి జరిగి నెల రోజులైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయంగా వివిధదేశాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తన భూభాగం కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని వీరు కోరారు. పుల్వామా వద్ద ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి విదితమే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దురాగతానికి పాల్పడినట్లు ఆధారాలను భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌తో పాటు ప్రపంచదేశాల ఎదుట పెట్టింది. ఈ దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై పాకిస్తాన్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. బాలాకోట్‌లో ఉగ్రవాదశిబిరంపై భారత్ వైమానిక దాడులు జరిపి ధ్వంసం చేసిన విషయం విదితమే. ఇంతవరకు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులపై తీసుకున్న చర్యలను పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు తెలియచేయలేకపోయింది. కాగా అంతకు ముందు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికా కార్యదర్శి మైక్ పాంపియోను కలుసుకున్నారు. తన భూభాగాన్ని ఉగ్రవాదుల కార్యకలాపాలకు కేంద్రంగా వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని పాంపియో పాకిస్తాన్‌కు మరోసారి విజ్ఞప్తి చేవారు. గత ఏడాది భారత్, అమెరికా దేశాలకు చెందిన ఉన్నత స్థాయి కార్యదర్శులు భారత్‌లో సమావేశమైన వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. వాటి పురోగతిని వాషింగ్టన్ సదస్సులో చర్చించినట్లు గోఖలే తెలిపారు. ఆఫ్గనిస్తాన్, ఉత్తరకొరియా, ఇరాన్, వెనిజులా దేశాల్లో తాజా రాజకీయ పరిస్థితులను ఇరుదేశాల అధికారులు సమీక్షించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా, భారత్‌తో పాటు పలు దేశాలు తమ బలాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్తులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరుదేశాలు చర్చించాయి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధనకు ఇరుదేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని నిర్ణయించినట్లు విజయ్ గోఖలే చెప్పారు.

చిత్రం..భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌గోఖలే