అంతర్జాతీయం

మళ్లీ అడ్డుకున్న చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 14: పాకిస్తాన్‌కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలోని 1267 అల్‌ఖయిదా ఆంక్షల కమిటి మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఫిబ్రవరి 27న చేసిన ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఇచ్చిన గడువు చివరి రోజయిన బుధవారం చైనా సాంకేతిక కారణం (టెక్నికల్ హోల్డ్) చూపుతూ అడ్డుకుంది. దీంతో చైనా వైఖరి తనను నిరుత్సాహానికి గురిచేసిందని భారత్ వ్యాఖ్యానించింది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన తరువాత ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఐరాస భద్రతా మండలి ముందు ప్రతిపాదన ఉంచాయి. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి అల్‌ఖయిదా ఆంక్షల కమిటి సభ్య దేశాలకు పది పని దినాల సమయం ఇచ్చారు. ఈ కాలపరిమితి న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 3 గంటలకు ముగిసిపోయింది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం బుధవారం అర్ధ రాత్రి తరువాత 12.30 గంటలకు ముగిసింది. ఈ గడువు ముగియడానికి కొద్దిసేపటి ముందు చైనా ఈ ప్రతిపాదనను సాంకేతికంగా నిలిపివేసిందని ఐరాసలోని ఒక దౌత్యవేత్త ఒక వార్తాసంస్థకు చెప్పారు. ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి తనకు మరికొంత సమయం కావాలని చైనా అడిగిందని ఆ దౌత్యవేత్త చెప్పారు. ఈ ‘టెక్నికల్ హోల్డ్’ ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. తరువాత మరో మూడు నెలల వరకు పొడిగించడానికి వీలుంటుంది. ఈ పరిణామంపై నిరుత్సాహానికి గురయినట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ప్రకటించింది. ‘మేము నిరుత్సాహానికి గురయ్యాం. భారత పౌరులపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను అనుసరిస్తాం’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటింపచేయడానికి చేసిన ప్రయత్నానికి మద్దతిచ్చిన దేశాలన్నింటికి భారత్ కృతజ్ఞతలు తెలిపింది.
ఇతర చర్యల దిశగా..
వాషింగ్టన్: మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడటం ఇలాగే కొనసాగితే, భద్రతా మండలిలోని బాధ్యత కలిగిన సభ్యదేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర చర్యలు తీసుకోవలసి వస్తుందని మండలిలోని దౌత్యవేత్తలు హెచ్చరించారు. మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరిన ప్రతిపాదనను చైనా ‘టెక్నికల్ హోల్డ్’లో పెట్టిన తరువాత పలువురు దౌత్యవేత్తలు స్పందించారు.