అంతర్జాతీయం

డ్రాగన్‌పై దృష్టి పెట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 14: ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలోని ఉత్తర ప్రాంతంలో చైనా దేశ కదలికలు అధికం అయ్యాయని, ఈ ప్రాంతంలో ఆ దేశ నౌకలు, సబ్‌మెరైన్‌లను అధిక సంఖ్యలో మోహరించారని, ఇది భారత్‌కు సవాల్ అయినా దానిపై తాము నిశితంగా దృష్టి సారించినట్టు నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా తెలిపారు. బ్రిటన్‌లో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రేటజిక్ స్టడీస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ నావికాదళ అభివృద్ధిపై చైనా పెడుతున్నంత పెట్టుబడి ప్రపంచంలోని ఏ దేశం పెట్టడం లేదని అన్నారు. హిందూ మహాసముద్రంలో ఆ దేశం ఇటీవల కాలంలో తన కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును 99 సంవత్సరాల లీజుకు తీసుకోవడం వ్యూహాత్మక చర్యల్లో భాగమేనని తాము భావిస్తున్నామన్నారు. తూర్పుచైనా ప్రాంతంలో ఆ దేశానికి జపాన్‌తో చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని, వియా త్నం, పిలిప్పిన్స్, మలేషియా, బ్రూనే, థైవాన్ దేశాలతో సైతం మంచి సంబంధాలు లేవని ఆయన చెప్పారు. ఏ దేశం చేపట్టని విధంగా నౌకానిర్మాణం చేపట్టి నౌకలను సమకూర్చుకుంటోందని, ఇది మిగిలిన దేశాలకు పెనుసవాలే అని, అందుకే తాము నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. హిందూ మహాసముద్రంలోని ఉత్తర ప్రాంతంలో చైనాకు చెందిన ఆరు నుంచి ఎనిమిది యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు మోహరించి ఉన్నాయని చెప్పారు. బ్రిటన్‌లో బ్రెగ్జిట్ అనంతర పరిణామాల గురించి భారత్ దృష్టి సారించడం లేదని, అయితే ఆ దేశంతో నావికా సంబంధమైన పటిష్టం చేసుకోవడం గురించి తాము యోచిస్తున్నామని తెలిపారు. ఇరుదేశాల మధ్య చిరకాలంగా ఉన్న స్నేహసంబంధాలను మరింత పటిష్టం చేసే దశలో తాము సాగుతున్నామన్నారు. ఇరుదేశాల మధ్య పటిష్టమైన రక్షణ సహాయం, సహకారం అవసరమని భావిస్తున్నామని తెలిపారు. బ్రిటన్ నావల్ స్ట్ఫా చీఫ్ అడ్మిరల్ ఫిలిప్ జోన్స్ మాట్లాడుతూ ఇరుదేశాల నావికాదళాల్లోనూ పోలికలున్నాయని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం సముపార్జన, భవిష్యత్ ప్రణాళికలు, నూతన నౌకల నిర్మాణం తదితర అంశాల్లో రెండు దేశాలు స్పష్టమైన లక్ష్యంతో సాగుతున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే మొదటి పది స్థానాల్లో ఉన్న భారత్, బ్రిటన్ దేశాలు నౌకానిర్మాణ పరిశ్రమలో సైతం పటిష్టమైన స్థానాలను కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు.