అంతర్జాతీయం

మూగబోయిన ఫ్రాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీస్, జూలై 18: నీస్ నగరంలో ఇటీవల జరిగిన అమానుష ట్రక్కు దాడిలో ప్రాణాలు కోల్పోయిన 84 మందికి సంతాపం వ్యక్తం చేస్తూ ఫ్రాన్స్ దేశ వ్యాప్తంగా ప్రజలు సోమవారం కొద్దిసేపు వౌనం పాటించారు. అయితే గురువారంనాటి మారణకాండపై రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలకు దిగడంతో ఈ సంతాప కార్యక్రమాలు మరింత విషాదంగా మారాయి. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలపైకి టునీషియాకు చెందిన ఉగ్రవాది వేగంగా ట్రక్కును నడిపించడంతో దానికింద నలిగి అసువులు బాసిన వారికి సంతాపం ప్రకటించడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజాసమూహాలతో నీస్ నగరం జనసముద్రాన్ని తలపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా జరిగాయి. ప్రజలు మృతులకు సంతాపం ప్రకటించడానికి నిమిషం వౌనం పాటించడంతోపాటు చర్చ్‌లలో గంటలు మోగించారు. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి మాన్యువల్ వాల్స్ నీస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వస్తుండగా, తిరిగి వెళ్తుండగా ప్రజలు కేకలు వేస్తూ నిరసన తెలిపారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ నినదించారు. ఫ్రాన్స్‌పై 18 నెలల్లో మూడోసారి ఉగ్రవాద దాడి జరిగిన తరువాత దేశ ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి, అసంతృప్తికి ఇది అద్దం పట్టింది. కాగా, ట్రక్కుతో దాడి చేసిన టునీషియాకు చెందిన 31 ఏళ్ల మొహమ్మద్ లాహౌఇజ్‌కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటివరకు నిర్ధారణకు రాలేకపోయారని ఫ్రాన్స్ హోంమంత్రి బెర్నార్డ్ కాజెనెవె ఆ దేశ ఆర్‌టిఎల్ రేడియోకు చెప్పారు. నీస్‌పై దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ఉగ్రవాదుల దాడులను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొంటూ హోంమంత్రి బెర్నార్డ్ గట్టిగా సమర్థించుకున్నారు. మరో తొమ్మిది నెలల్లో దేశ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అయితే ఉగ్రవాద దాడులను నిరోధించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని మాజీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నికోలస్ సర్కోజి విమర్శించారు. ఈ 18 నెలల్లో మొదటి రెండు దాడులు జరిగిన సమయంలో దేశంలోని అన్ని పక్షాల నాయకులు ఒక్కటిగా ఉన్నారు. అయితే ఈ మూడో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత మాత్రం పరస్పర విమర్శలకు దిగుతున్నారు.

చిత్రం.. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ట్రక్కుదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు భారీగా తరలివచ్చిన జనం