అంతర్జాతీయం

భారత్-అమెరికా అణుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 14: భారత్‌లో ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం, పౌర అణు ఇంధన సరఫరాలో సహకారం కొనసాగించే చర్యల్లో భాగంగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఆరు అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అమెరికా అంగీకరించింది. అణు సరఫరా గ్రూపు(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్వత్వానికి సంబంధించి అగ్రరాజ్యం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది. ఇది మరింత త్వరగా సాకారమయ్యేందుకు ఆరు అణు విద్యుత్ ప్లాంట్‌లు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనిపై ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. భారత్-యూఎస్ తొమ్మిదో వ్యూహాత్మ భద్రతా చర్చలు ఇక్కడ ముగిశాయి. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆండ్రియా థామ్సన్ సారధ్యంలో చర్చలు జరిగాయి. ‘ద్వైపాక్షి సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. భద్రత, పౌర అణు సంబంధాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణియించుకున్నాయి. ఇందులో భాగంగానే ఆరు అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు అంగీకారం కుదిరింది’అని ఆ ప్రకటనలో వెల్లడించారు. అయితే ప్లాంట్‌లు ఎక్కడ ఏర్పాటు చేస్తుందని వివరాల్లోకి వెళ్లలేదు. 2008 అక్టోబర్‌లో భారత్-అమెరికా చారిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందం ద్వైపాక్షి సంబంధాలు మరింత బలపడేందుకు దోహదపడింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్వత్వం కల్పించే దిశగా తాజాగా జరిగిన ఈ చర్చలు మరింత ఊతాన్నిస్తాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, యూకే, జపాన్, వియత్నాం, బంగ్లాదేశ్, కజకిస్తాన్, దక్షిణ కొరియాతో భారత్ అణు సహకార ఒప్పదంలు చేసుకుంది. 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సాధ్యమైనంత త్వరగా సభ్యత్వం కల్పించాలని అమెరికా కోరుతోంది. అయితే చైనా ఎప్పటి నుంచో దీనికి అడ్డుతగులుతోంది. దీంతో సభ్వత్వం విషయం పెండింగ్‌లోనే ఉండిపోయింది. బుధవారం ఇక్కడ జరిగిన ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చలు సాగాయి. ఉగ్రవాదం, భద్రత వంటి అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి.
చిత్రం.. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆండ్రియా థామ్సన్