అంతర్జాతీయం

పెరుగుతున్న వేడితో గుండెపై దుష్ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, మార్చి 15: అతివేడిమి కారణంగా గుండెపోటు సంభవించే ప్రమాదకర పరిస్థితులు 2001-2014 మధ్య కాలం నుంచి అధికమయ్యాయి. గడచిన 28 ఏళ్ల గణాంకాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. 1987 నుంచి 2014 వరకు గుండెపోటుకు గురైన 63 మూడేళ్ల వరకు వయసున్న 27వేల మందికి పైగా రోగుల పరిస్థితులపై ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 73 శాతం పురుషులున్నారు. ఇందులో దాదాపు 13000 మంది మృత్యువాత పడ్డారని నివేదిక పేర్కొంది. వ్యక్తిగత గుండెపోటు ఘటనల గణాంకాలను, సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలను, ఆకస్మిక విపత్తు సంభవించిన రోజున ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు తెలిపింది. గడచిన 28 ఏళ్లతో పోల్చిచూస్తే 2001-2014 మధ్య కాలం నుంచే హార్ట్ ఎటాక్ రిస్క్ పెరిగిపోయిందని జర్మనీ హెల్మ్‌హాల్ట్‌జ్ జన్‌ట్రమ్ మున్‌చెన్ పరిశోధనా విభాగానికి చెందిన ప్రముఖుడు కాయ్‌చెన్ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సైతం అధిక శాతం గుండెపోటుకు దారితీస్తున్నట్టు అధ్యయనంలో తేలిందని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా అధిక వేడిమి వల్ల మధుమేహం, హైపర్‌లైపీడయామియా కారణంగా రక్తంలో అధిక శాతం కొవ్వు నిల్వలు చేరిన వ్యక్తులు కూడా గుండెపోటుకు గురవుతున్నట్టు తేలిందని చెన్ తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ కూడా ఓ కారణమని తొలుత భావించామని, తర్వాత దానితోబాటే మరికొన్ని అంశాలూ తోడవుతున్నాయని గుర్తించామని చెప్పారు. కాగా వాతావరణ మార్పులు గుండెపై అధిక ప్రభావం చూపుతున్నాయని ప్రధాన పరిశోధకుడు అలెగ్జాండర్ స్క్నైడర్ తెలిపారు.