అంతర్జాతీయం

మమ్మల్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 16: ‘ భూతాపం నుంచి మా జీవితాలకు రక్షణ ఏది’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కారు. భూగోళంలోని సమస్త జీవజాతులను కబళిస్తూ మానవ మనుగనే ప్రశ్నార్థకం చేస్తోంది. పర్యావరణ మార్పులను నిరోధించేందకు యుద్ధప్రాతిపదికన కఠిన చర్యలు చేపాలంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు. దక్షిణ పసిఫిక్ నుంచి ఆర్టిక్ వలయం వరకు అనేక దేశాలకు చెందిన విద్యార్థులు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమించారు. దాదాపు వంద దేశాలకు పైగా చెందిన విద్యార్థులు తమ తరగతి గదులను బహిష్కరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. పర్యావరణ సమతూకాన్ని కాపాడడంలో తమ దేశ ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్న ఆగ్రహం వారి మాటల్లో కనిపించింది. సామాజిక మీడియా ఇతర ప్రసార సాధనాల ద్వారా అందిన సంకేతాలను అందిపుచ్చుకున్న విద్యార్థులతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు లక్షా యాభైవేల మంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. సరిహద్దులు, భాషలు, ప్రాంతాలు తమను వేరు చేయలేవని ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను అన్ని దేశాలు తక్షణ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జరిగిన మరో ప్రదర్శనలో ఎనిమిదేళ్ల బాలిక అవాన అడ్వర్స్ పర్యావరణాన్ని కాపాడుకు కోవడంలోనే ప్రపంచ మనుగడ ఆధారపడి ఉందని తెలిపింది. అమెరికాలో న్యూయార్క్ సిటీలో గల కోలంబస్ సర్కిల్ సిటీ హౌస్, అమెరికా మ్యూజియంలలో భారీ ఎత్తున ప్రదర్శన జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన 16మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విసర్జితమవుతున్న కాలుష్య ఉద్గారాల పరిణామాన్ని తగ్గించని పక్షంలో వాతావరణ పరిస్థితులు మరింతగా క్షీణించే ప్రమాదముందని శాస్తవ్రేత్తలు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో విద్యార్థులే ఉద్యమ సారథ్యాన్ని చేపట్టడం గమనార్హం. మానవాళి చరిత్రలోనే ఇంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ తలెత్తలేదని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన హన్‌బెర్గ్ స్టాక్‌హోమ్‌లో జరిగిన ఓ ర్యాలీలో అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు జరిగినా ఆయా ప్రభుత్వాల నేతలు రాజకీయ చిత్తశుద్ధితో చర్యలు చేపడితేనే వాతావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేసిన నిరసన కారులు ఈ దిశగా మరింత కఠిన చర్యలకు సిద్ధం కావలసిన అవసరం ఉందన్నారు. భారత రాజధానికి న్యూఢిల్లీలో కూడా స్కూలు పిల్లలు ప్రదర్శన చేపట్టారు. ఇప్పటికే దేశంలో కాలుష్యం పెరిగిపోతోందని అధికారులు తక్షణ ప్రాతిపదికన డిమాండ్ చేశారు.

చిత్రం.. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా మాంత్రియల్‌లో జరిగిన విద్యార్థుల ప్రదర్శన