అంతర్జాతీయం

బాధితులకు బాసటగా న్యూజిలాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చ్, మార్చి 16: రెండు మసీదుల్లో ఓ జాత్యహంకారి పాల్పడిన ఊచకోతను నిరసించడంతో పాటు మీతో మేమున్నామంటూ మతాలకతీతంగా న్యూజిలాండ్ ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చి బాధిత ముస్లింలకు బాసటగా నిలిచారు. పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి మిలియన్ల కొద్ది డాలర్ల నిధులు సమకూర్చడంతో పాటు హలాల్ చేసిన ఆహార పదార్థాలు సరఫరా చేశారు. వీధుల్లో నడవడానికి భయపడుతున్న స్థానిక ముస్లింలకు తోడుగా వస్తున్నారు. సగటున ఏడాదికి 50కి మించి హత్యలు జరుగని న్యూజిలాండ్‌లో శుక్రవారం ఓ ఉన్మాది రెండు మసీదుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, 49 మందిని పొట్టన పెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అయితే, దాడికి గురయిన బాధిత ముస్లిం కమ్యూనిటీకి న్యూజిలాండ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వెల్లివిరుస్తోంది. కాల్పుల ఘటన జరిగిన క్రైస్ట్‌చర్చ్ శివారు ప్రాంతంలో యోతి లోన్సౌ, అతని భార్య హలాల్ చేసిన ఆహార పదార్థాలు కావాలంటూ ఫేస్‌బుక్‌లో స్థానికులకు ఒక పోస్ట్ పెట్టారు. కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారి బంధువుల కోసం ఈ పోస్ట్ పెట్టారు. క్షతగాత్రులను రక్షించడానికి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తుంటే, వారు ప్రాణాలతో బయటకు రావాలని వారి బంధువులు ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆసుపత్రుల వద్ద ఉన్న క్షతగాత్రుల బంధువులకు ఆహారం సరఫరా చేయడానికి ఆ దంపతులు హలాల్ చేసిన ఆహార పదార్థాలు కావాలని పోస్ట్ పెట్టారు.
శనివారం అంతా హలాల్ చేసిన ఆహార పదార్థాలను అందజేయడానికి ప్రజలు వరుస క్రమంలో నిలబడ్డారని యోతి లోన్నౌ దంపతులు తెలిపారు. బాధితులకు సహాయం చేయగలిగినందుకు తమకు చాలా సంతోషంగా ఉందని వారు ఒక వార్తాసంస్థతో అన్నారు.
చిత్రం.. న్యూజిలాండ్‌లో జరిగిన నరమేధం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. శనివారం క్రైస్ చర్చ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సంస్మరణ కేంద్రానికి వచ్చి వేలాది మంది నివాళులు అర్పించారు...