అంతర్జాతీయం

జింబాబ్వేలో తుపాను బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, మార్చి 16: తూర్పు జింబాబ్వేలో పెను తుపానుకు కనీసం 24 మంది మృతి చెందారు. అనేక మంది ఆచూకీ తెలియకుండాపోయింది. ఐదాయ్ తుపాను పెను బీభత్సం సృష్టించిందని అధికారులు వెల్లడించారు. ‘ ఇప్పటికైతే 24 మంది చనిపోయినట్టు సమాచారం ఉంది. ఇవన్నీ తూర్పు ఛిమానిమాని ప్రాంతంలో సంభవించిన మరణాలే’అని జింబాబ్వే సమాచార మంత్రిత్వశాఖ పేర్కొంది. తుపాను నష్టానికి సంబంధించి మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. డజన్ల కొద్దీ జనం గల్లంతయారని తెలిపారు. 40 మంది గాయపడ్డారని అన్నారు. మనీచలాండ్ రాష్ట్రంలో వంతెనలు కొట్టుకుపోయాని, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని వారన్నారు. మనీచలాండ్- మొజాంబిక్ సరిహద్దులో భారీ నష్టం వాటిల్లందని అధికారులు వెల్లడించారు. ఈదురుగాలలు అల్లకల్లోలం సృష్టించాయని, ఇళ్లలోకి నీళ్లు రావడంతో జనం భయపడి కొండలపైకి పోయి తలదాచుకున్నట్టు వారు పేర్కొన్నారు. ఈదురు గాలులు, వాతావరణ పరిస్థితులు సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారాయని తెలిపారు. ఎక్కడక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, వంతెనలు కొట్టుకుపోయాయని సంబంధిత మంత్రి చెప్పారు. తుపాన్ వల్ల తూర్పు జింబాబ్వేలో వరదలు చుట్టుముట్టాయి. వంద మంది ఆచూకీ తెలియకుండా పోయిందని స్థానిక ఎంపీ జాషువా సక్కో వెల్లడించారు. ఛిమానీమని అర్బన్‌లోని నగ్నావ్ టౌన్‌షిప్‌లో కనీసం 25 ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియల కింద కొందరు చిక్కుకున్నట్టు తెలిసింది. అనేక మంది గల్లంతయ్యారు. ఐదాయ్ తుపాను సరిహద్దునే ఉన్న మధ్య మధ్య మొజాంబిక్‌లో తుపానుకు శుక్రవారం రాత్రి 19 మంది చనిపోయారు. బైరాలో లక్ష మందికి సంబంధాలు తెగిపోయాయి. వారమంతా తుపాను బీభత్సం సృష్టించింది. అరవై మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. సైన్యం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. స్కూల్ భవనం మూతపడడంతో సహాయం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
చిత్రం.. జింబాబ్వేలో శనివారం సంభవించిన పెను తుపాను విలయ దృశ్యమిది.