అంతర్జాతీయం

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 16: భారత్, అమెరికా మధ్య సంబంధాలు ధృడమైనవని, రెండూ పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, పరస్పర అవగాహనతో ఇరు దేశాలు ముందడుగు వేస్తాయని అమెరికా అధికార వర్గాలు ప్రకటించాయి. భారత్ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మూడురోజుల పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా గోఖలే అమెరికా కార్యదర్శి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఇంకా అనేక మంది ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, పుల్వామా ఉగ్రవాద దాడి ఘటన, పాకిస్తాన్‌లోని బాలాపూర్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ జరిపిన వైమానిక దాడులు, ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై పెరిగిన వత్తిడి తదితర అంశాలను భారత్ ప్రతినిధుల బృందం అమెరికా అధికారులతో చర్చించింది. అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు బోల్టన్ మాట్లాడుతూ అమెరికా, భారత్ సంబంధాలు పటిష్టమైనవని, ఆత్మరక్షణ కోసం భారత్ చేసే దాడిని అమెరికా సమర్థిస్తుందని చెప్పారు. అన్ని అంశాల్లో భారత్‌తో భుజం భుజం కలిపి అమెరికా నడుస్తుందని భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా నిలబడుతామన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా అణచివేయాలన్నారు. వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య చెక్కుచెదరని సంబంధాలు ఉన్నాయన్నారు. ఇరుదేశాల దౌత్యాధికారులు ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై సమాచారాన్ని మార్చుకుంటున్నారని చెప్పారు. భారత్‌లో ఆరు అణు ప్లాంట్లను నిర్మిస్తామని అమెరికా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందని బోల్టన్ చెప్పారు. అణు ఇంధన రంగంలో భారత్ స్వావలంభన సాధించే దిశగా తాము అవసరమైన సాంకేతిక ఇంధన సహాయం చేస్తామని అమెరికా పేర్కొంది. అమెరికా కార్యదర్శి మైక్ పాంపియోతో భారత్ విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే జరిపిన చర్చల వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయాలని, సరిహద్దు చొరబాట్లను నిర్మూలించాలన్న భారత్ ఆకాంక్షకు మద్దతు ఇస్తామని పాంపియో ప్రకటించారని దౌత్యవర్గాలు తెలిపాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్ చేస్తున్న కృషికి మద్దతు ఇస్తామన్నార. ఈ సందర్భంగా వ్యూహాత్మక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం అంశాలపై జరిగిన అనేక సమావేశాల్లో భారత్, అమెరికా అధికారులు పాల్గొన్నారు.