అంతర్జాతీయం

పోస్ట్-స్టడీ వీసాలతో భారతీయులకు లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 16: బ్రిటన్ శనివారం ప్రారంభించిన ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజి’లో భాగంగా అమలులోకి తేనున్న ‘ఇంప్రూవ్డ్ పోస్ట్-స్టడీ’ వీసా విధానం వల్ల భారతీయ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన (బ్రెగ్జిట్) అనంతరం అనుసరించే విధానాలలో భాగంగా ఆ దేశం కొత్తగా ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజి’ని ప్రారంభించింది. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యిసించే ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల సంఖ్యను పెంచడానికి బ్రిటన్ ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 4,60,000 ఉండగా, దీనిని 2030 నాటికి 6,00,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ వెలుపలి దేశాలలో చైనా తరువాత భారత్ నుంచే ఎక్కువ మంది యూకేలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. పోస్ట్-స్టడీ వర్క్ ఐచ్ఛికం వల్ల భారతీయ విద్యార్థులు యూకే యూనివర్శిటీలలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన తరువాత పని అనుభవాన్ని పొందడానికి వీలు కలుగుతుంది