అంతర్జాతీయం

రాజధాని నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా అభివృద్ధికి తొలి అడుగు పడింది. సీడ్ క్యాపిటల్ ఏరియాలోని 6.84 చదరపు కిలోమీటర్ల (1691 ఎకరాల పరిధి) అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానంలో గ్లోబల్ టెండర్లను సిఆర్‌డిఏ ఆహ్వానించింది. ఈమేరకు సుమారు 50 దేశాల ఎంబసీలు, ఏజెన్సీలకు సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ సోమవారం ఈ-మెయి ల్స్ పంపారు. 6.84 చదరపు కిలోమీటర్ల ఏరియాను 20 ఏళ్లలో అభివృద్ధి చేయడానికి సింగపూర్‌కు చెందిన సింగపూర్ కన్సార్టియం ఎసెండాస్, సింగ్‌బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, సెంబోక్రాప్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సంస్థలు స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రభుత్వానికి తమ అభిమతాన్ని తెలియజేశాయి. ఈ కంపెనీలను ఒరిజనల్ ప్రాజెక్ట్ ప్రొపొనెంట్‌గా (ఒపిపి)గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ జీఓ జారీ చేసింది. అయితే ఈ సంస్థలకన్నా మెరుగ్గా ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని ఇతర సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉందా? అనే విషయం తెలుసుకునేందుకు ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్‌ను సోమవారం విడుదల చేశారు. సుమారు 50 దేశాల్లోని వివిధ నిర్మాణ సంస్థలు, ఎంబసీలు, ఏజెన్సీలకు ఈమేరకు మెయిల్స్ పంపారు.
ఈ బిడ్డింగ్‌కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఆగస్ట్ 5వ తేదీలోగా నివృత్తి చేసుకోవచ్చు. ఆగస్ట్ 8న ప్రీ-బిడ్ సమావేశం జరుగుతుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆసక్తి ఉన్న సంస్థలు బిడ్‌లు దాఖలు చేసుకోవలసి ఉంటుంది. బిడ్‌లో పాల్గొన్నవారి అర్హతలను కూడా అదేరోజు నాలుగు గంటల వరకూ పరిశీలిస్తారు. బిడ్డింగ్‌లో పాల్గొనే అర్హత ఉన్న సంస్థలను సెప్టెంబర్ 6న షార్ట్‌లిస్ట్ చేస్తారు. సెప్టెంబర్ 8న కమర్షియల్ బిడ్‌లు తెరుస్తారు. బిడ్‌ను దక్కించుకున్న సంస్థ సీడ్ క్యాపిటల్‌లోని 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలి. బిడ్‌ను దక్కించున్న సంస్థను మాస్టర్ డెవలపర్‌గా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఏరియా అభివృద్ధి, అభివృద్ధి చేసిన ప్లాట్లను విక్రయించే బాధ్యతను ఆ సంస్థకే అప్పగిస్తారు. అలాగే స్టార్టప్ ఏరియాకు సమాంతరంగా ఇతర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కాంపిటెంట్ డెవలపర్‌ను ఈ సంస్థే తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే సీడ్ క్యాపిటల్ ఏరియాలో పెట్టుబడులను ఆహ్వానించడం, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి బాధ్యతలు కూడా ఈ సంస్థే చూసుకోవలసి ఉంటుంది.

చిత్రం.. సీడ్ క్యాపిటల్ ఏరియా ప్రతిపాదిత ప్లాన్