అంతర్జాతీయం

మైత్రికి మరింత బలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాలే, మార్చి 17: భారత్ మాల్దీవుల మధ్య మరింత సన్నిహిత సంబంధాల మార్గం సుగమం అయింది. ఆదివారం మాలే చేరుకున్న భారతీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షహీద్ విస్తృత చర్చలు జరిపారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల అమలు తీరును కూడా ఈ సందర్భంగా ఆమె సమీక్షించారు. రెండు రోజుల పాటు మాల్దీవుల్లోనే పర్యటన జరపనున్న సుష్మా రెండు దేశాలను మరింతగా అనేక రంగాల్లో సన్నిహితం చేసే అంశాలపై దృష్టి పెడతారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సుహృద్భావ రీతిలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రాజేష్ కుమార్ తెలిపారు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడు సోలీ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు కూడా సుష్మా స్వరాజ్ విస్తృతంగా సమీక్షించారని ఆయన తెలిపారు. మాల్దీవుల అభివృద్ధికి భారత్ ఇప్పటికే 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో సుస్థిరతను పరిరక్షించేందుకు కలసి కట్టుగా పనిచేయాలని సోలీ పర్యటన సందర్భంగా నిర్ణయం తీసుకున్నాయి. అందుకు సంబంధించిన అంశాలపై కూడా సుష్మా స్వరాజ్ దృష్టి పెట్టారు. పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను అనుమతించకూడదన్న నిర్ణయాన్ని కూడా ఈ రెండు దేశాలు ప్రకటించిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తాజా పర్యటన చేపట్టడం గమనార్హం. ఈ రెండు రోజులు పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షులు సోలీతో సోమవారం ఆయన సమావేశమవుతారు. ఇప్పటికే భారత్ మాల్దీవుల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని వీటిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే సుష్మా స్వరాజ్ రెండు రోజులపాటు పూర్తి స్థాయి పర్యటనను చేపట్టాయని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించాయి.
చిత్రం.. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షహీద్‌తో
ఆదివారం సమావేశమైన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్