అంతర్జాతీయం

నెదర్లాండ్స్‌లో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద హేగ్, మార్చి 18: ఉగ్రవాదిగా భావిస్తున్న ఒక వ్యక్తి డచ్‌లోని ఉట్రెచ్ట్ నగరంలోని ఒక ట్రామ్‌లో సోమవారం జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నెదర్లాండ్స్‌లోని ప్రముఖమైన ఈ నగరంలో జరిగిన ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా అధికారులు భావిస్తున్నారు. సాయుధ పోలీసులు, అత్యవసర సర్వీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌ల మధ్య ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు కారకులుగా భావిస్తున్న వ్యక్తులు పరారైనట్టు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఉట్రెచ్ట్ పోలీసులు తెలిపారు. ట్రామ్‌లో జరిగిన ఈ సంఘటనలో గాయపడిన పలువురిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే డచ్ ప్రధాని మార్ రుట్టే తన కార్యక్రమాలను రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఈ దాడి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని భావిస్తున్నట్టు డచ్ నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ హెడ్ పీటర్ జాబ్ ట్వీట్ చేశారు. రోడ్ బ్రిడ్జి పక్కన నిలిపివేసిన ట్రామ్, చుట్టుపక్కల ఆయుధాలతో మోహరించిన పోలీసులు ఉన్న ఫొటోలను స్థానిక మీడియా ప్రచురించింది. కాగా, పౌరులపై పెద్దయెత్తున దాడి చేయాలని పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని, దీనికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని గత ఏడాది సెప్టెంబర్‌లో నెదర్లాండ్స్ అధికారులు ప్రకటించారు. అంతేకాక బాంబుల తయారీకి ఉపయోగించే సామాగ్రిని పెద్దయెత్తున స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశంలో ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉందని వారు అప్పటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు.