అంతర్జాతీయం

ఇండోనేషియా వరద మృతులు వందకు పైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంతాని (ఇండోనేషియా), మార్చి 20: ఇండోనేషియాలోని పాపువా ప్రాంతంలో ఇటీవల ఆకస్మాత్తుగా ముంచెత్తిన వరదలతో పాటు కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతుల సంఖ్య వందకు పైగా ఉండవచ్చునని, గల్లంతైన అనేకమంది జాడ ఇంకా తెలియరాలేదని విపత్తుల నివారణ సంస్థ బుధవారం తెలియజేసింది. శనివారం కురిసిన భారీ వర్షం, కొండచరియలు విరిగిపడ్డ ప్రమాదాల్లో ఇప్పటివరకు 104 మంది మృతి చెందగా, 79 మంది గల్లంతయ్యారని, సుమారు పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించినట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని, చాలామందికి ఎముకలు విరిగాయని, ప్రమాదంలో మృతి చెందిన 40 గుర్తు తెలియని మృతదేహాలకు బుధవారం సామూహిక అంత్యక్రియలు జరిపినట్టు చెప్పారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన అనేకమంది తిరిగి ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయమోనన్న భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇలావుండగా వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్న షెల్టర్లు నిరాశ్రయులతో నిండిపోవడంతో అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.