అంతర్జాతీయం

ఆక్స్‌ఫర్డ్ పదకోశంలో చేరిన ‘చెడ్డీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 21: ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల పద నిఘంటువులో చెడ్డీస్ అనే భారత ఆంగ్ల పదానికి చోటు కల్పించారు. చెడ్డీ అంటే అండర్ వియర్. ఈ ఏడాది ఈ పద నిఘంటువులో 650 కొత్త పదాలకు స్థానం కల్పించారు. ఈ కొత్త పద నిఘంటువును గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. చెడ్డీస్ అనే పదం ఇంగ్లాండ్‌లో బాగా పాపులరైంది. ఇక్కడ స్థిరపడిన భారతీయులు ఈ పదాన్ని బాగా వాడుతుంటారు. ఈ వివరాలను ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల పద నిఘంటువు సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ జొనాథన్ డెంట్ వెల్లడించారు. ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్ పద నిఘంటువు 90వ వార్షికోత్సవం జరగనుంది. తమ ప్రచురణకర్తలు ఎప్పటికప్పుడు ప్రాంతీయ పదాలను సేకరించి వాటికి ఈ నిఘంటువులో స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. వెల్స్ ఇంగ్లీష్‌లో ఉల్లిపాయలను జిబ్బాన్స్ అని అంటారు. ఈ పదాన్ని కూడా చేర్చినట్లు ఆయన చెప్పారు. ప్రాంతీయంగా ప్రాచుర్యం పొందిన పదాలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.