అంతర్జాతీయం

మితిమీరిన చర్యలొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, జూలై 18: తిరుగుబాటుదారులపై అణచివేత చర్యలను చేపట్టిన టర్కీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి వీల్లేదని అమెరికా, ఐరోపా యూనియన్లు హెచ్చరించాయి. దేశంలో మళ్లీ మరణశిక్షను అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా ఐరోపా యూనియన్‌లో సభ్యత్వ అవకాశాలే దెబ్బతింటాయని మరోపక్క జర్మనీ, ఇయూలు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కు తేల్చిచెప్పాయి. సైనిక తిరుగుబాటు విఫలమైన నేపథ్యంలో కుట్రదారులపై తీవ్రస్థాయిలో అణచివేత చర్యలు చేపట్టడం ఎంతమాత్రం క్షమార్హం కాదని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తెలిపారు. చట్ట పరంగా దోషుల్ని శిక్షించదలచుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని కానీ దీనికి అతీతంగా చర్యలు చేపడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.