అంతర్జాతీయం

ఆసియా సొసైటీ మ్యూజియంలో ఎంఎఫ్ హుస్సేన్ పెయంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 22: భారత్‌కు చెందిన సుప్రసిద్ధ చిత్రాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను ఇక్కడ ఆసియా సొసైటీ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. పది అడుగుల ఎత్తు ఉన్న పెయింటింగ్‌ను 1975లో హుస్సేన్ రూపొందించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ర్యాలీలో దీనిని స్టేజీ వెనక అందంగా ఉంచడం ఆ రోజుల్లో పెద్దగా చర్చనీయాంశమైంది. 60 అడుగులు వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్‌లో గుర్రాలను చిత్రీకరించారు. భారత తొలి ప్రధాని ఇందిరాగాంధీని చూసి స్ఫూర్తి చెందిన హుస్సేన్ ఈ పెయింటింగ్‌ను రూపొందించారు. ముంబాయిలోని శివాజీ పార్కులో ఇందిరాగాంధీ ర్యాలీ సభలో స్టేజి వెనక ఈ చిత్రపటాన్ని ప్రముఖంగా అలంకరించారు. అదే ఏడాది ఇందిరాగాంధీ జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ విధించారు. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆసియా సొసైటీ ఎంటర్‌ప్రెన్యూర్, ఇనె్వస్టర్ కెంట్ చారుగుండియా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ పెయింటింగ్‌ను కూడా సేకరించి ఈ ప్రదర్శనలో ఉంచాలని నిర్ణయించారు.
ంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్‌లో ఇది గొప్ప కళాఖండమన్నారు. ఇది అతి పెద్ద కళాఖండమన్నారు. హుస్సేన్ అనేక అంశాలు యుద్ధం, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం, అణు శక్తిపై పెయింటింగ్స్‌ను వేశారని చెప్పారు.