అంతర్జాతీయం

పర్యావరణ పరిరక్షణపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మార్చి 22: పారిస్ వాతావరణ ఒప్పందం మేరకు ప్రజా సంబంధాల కోసం లేదా లాబీయింగ్ నిమిత్తం ఐదు కంపెనీలు ఎకాఎకిన ఒక బిలియన్ అమెరికా డాలర్లను ఖర్చుపెట్టడం వివాదస్పదంగా మారింది. 2015 నుంచి గత నాలుగేళ్లలో ఈ సొమ్మును ఖర్చుపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివరాలను ఇన్‌ఫ్లూయెన్స్ మ్యాప్ అనే వాచ్‌డాగ్ ప్రకటించింది. భూతాపాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు సమగ్రమైన చర్యలు తీసుకోవాలని పారిస్ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఎక్సోన్ మొబిల్, షెల్, చెవ్రోన్, బీపీ కంపెనీలు ఒక్క ఏడాదిలోనే శిలాజ ఇంధన కార్యకలాపాలకు 200 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాయి. కాగా వాచ్‌డాగ్ చేసిన అభియోగాలను షెల్, చెవ్రోన్ కంపెనీలు తోసిపుచ్చాయి. శిలాజ ఇంధన విభాగం వ్యూహాత్మక విధానమని, పారిస్ వాతావరణ అజెండాను ప్రభావితం చేసిందని ఇన్‌ఫ్లూయెన్స్ మ్యాప్ ఈడీ దిలాన్ టానెర్ చెప్పారు. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటాదారులు మాత్రం తమ సొమ్మును ఎడాపెడా ఖర్చుపెట్టడంపై వివరణ ఇవ్వాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఈ ఐదు కంపెనీలు వివిధ దేశాల్లో చట్టసభల ప్రతినిధులు, విధానాలను రూపొందించేవారితో సంబంధాలు పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడినట్లుగా చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్లు నిధులను ఖర్చుపెట్టినట్లు వాచ్ డాగ్ పేర్కొంది. ఈ ఐదు కంపెనీలు 2019లో 110 బిలియన్ డాలర్ల పెట్టుబడులను చమురు, సహజవాయవురంగాల్లో పెట్టాయి. ఈ కంపెనీలు కేవలం 3.6 బిలియన్ డాలర్లను తక్కువ కార్బన్ స్కీంల విభాగంలో పెట్టుబడులు పెట్టాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ఈ కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నాయని, ఐరోపా, అమెరికా నిపుణులంటున్నారు.
కేవలం లాబీయింగ్‌కు ఖర్చుపెడుతున్నాయని చెప్పారు ఎక్సాన్ కంపెనీ క్లైమేట్ బ్రాండింగ్‌కు 56 మిలియన్ డాలర్లను ఒక ఏడాదిలో ఖర్చుపెట్టింది. 2017లో ఎడాపెడా ఖర్చుపెట్టవద్దంటూ వాటాదారులు కంపెనీపై వత్తిడి తెచ్చారు. షెల్ కంపెనీ సాలీనా 49 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టింది. పారిస్ ఒప్పందానికి లోబడి భూతాపం తగ్గించే చర్యలు, పర్యావరణ పరిరక్షణకు తాము ఖర్చుపెట్టినట్లు , వాచ్‌డాగ్ చేసిన అభియోగాల్లో నిజం లేదని ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు.