అంతర్జాతీయం

ఫ్రాన్స్ నిర్ణయం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనామా సిటీ, ఏప్రిల్ 9: పనామా పేపర్స్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ పనామాను ‘సహకరించని దేశాల’ జాబితాలో చేర్చడం పొరపాటు నిర్ణయమని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వారెలా పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్ ప్రభుత్వ నిర్ణయం పొరపాటుదే కాకుండా అనవసర చర్య అని విమర్శించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాల నుంచి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. పనామా అనేది ఒక దేశమని, ఈ దేశాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని ఫ్రాన్స్‌కు గట్టిగా చెప్పేందుకు తమ దేశ ఆర్థిక మంత్రి డుల్సిడియో డి లా గువార్డియా మంగళవారం ఆ దేశానికి వెళ్తున్నారని జువాన్ కార్లోస్ వెల్లడించారు. పన్నుల సమాచారాన్ని పంచుకునే విషయంలో పనామాను తిరిగి ‘సహకరించని దేశాల’ జాబితాలో చేరుస్తామని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి మిచెల్ సాపిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పన్నుల ఎగవేతపై పోరాడటానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన తరువాత ఫ్రాన్స్ 2012లో ‘సహకరించిన దేశాల’ జాబితాలోనుంచి పనామా పేరును తొలగించింది. ఇప్పుడు మళ్లీ పనామాను ఆ జాబితాలో చేర్చడం ద్వారా ఫ్రాన్స్ ఇకమీదట పనామాతో జరిగే అన్ని లావాదేవీలను, వ్యవహారాలను అనుమానాస్పదంగానే చూస్తుంది. ఎలాంటి అక్రమాలు జరగలేదని ధ్రువీకరించే ఆధారాలు ఉంటే తప్ప పన్నుల విషయంలో మోసం జరిగినట్లుగానే భావిస్తుంది.