అంతర్జాతీయం

థెరీసాకు మళ్లీ చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 29:బ్రెగ్జిట్ మరింత సంక్షోభంలో పడింది. ఐరోపా యూనియన్ నుంచి వైదొలగేందుకు బ్రిటన్ ప్రధాని ధెరీసా మే తాజాగా చేసిన ప్రయతాన్ని కూడా పార్లమెంట్ సభ్యులు తిరస్కరించారు. ధెరీసా ప్రయత్నాలు విఫలం కావడం ఇది మూడోసారి. తాజా పరిణామంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో థెరీసా ప్రతిపాదనలకు అనుకూలంగా 286 ఓట్లు వ్యతిరేకుండా 344 ఓట్లు వచ్చాయి.
ఈ ప్రతిపాదనలను పార్లమెంట్ ఆమోదించి ఉంటే విడాకులకు సంబంధించిన అన్ని శాసనాలనూ ఆమోదించుకోవడానికి బ్రిటన్‌కు మే 22 వరకూ గడువు లభించి ఉండేది. పరిస్థితి మరింత సంక్షుభితం కావడంతో ఏప్రిల్ 12 లోగా తన నిష్క్రమణకు సంబంధించి ప్రత్యామ్నాయ పథకాన్ని బ్రిటన్ ఈయూకు అందించాల్సి ఉంటుంది. ఎంపీల నిర్ణయ పరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయని ఓటింగ్ అనంతరం ప్రథాని ధెరీసా మే వ్యాఖ్యానించారు.
అయినా కూడా క్రమపద్ధతిలోనే ఈయూ నుంచి వైదొలగేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని, రిపరెండం డిమాండ్లను సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, తాజా పరిణామాలను చర్చించేందుకు ఏప్రిల్ 10న ఐరోపా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు దాని అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ తెలిపారు.