అంతర్జాతీయం

నీరవ్, మాల్యాను ఒకే జైలు గదిలో ఉంచుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 30: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని మోసం చేసి లండన్‌లో ఉంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కోసం పెట్టుకున్న రెండో దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ బెయిల్ పిటిషన్ శుక్రవారం వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు వచ్చింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన మెజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బుత్‌నాట్ కోర్టులో సరదా వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తే, విజయ్ మాల్యానుంచే జైలు గదిలోనే పెడతారా?అని వ్యాఖ్యానించారు. బహుషా మాల్యా కోసం సిద్ధం చేసిన ముంబయి ఆర్థర్ జైలులోనే నీరవ్‌ను ఉంచవచ్చని భారత్ తరుఫున వాదిస్తున్న క్రౌన్ ప్రిన్స్ సర్వీస్(సీపీఎస్) న్యాయవాది అన్నారు. దీనిపై ఎమ్మాపై విధంగా స్పందించారు. లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్‌మాల్యా కేసు ఇదే కోర్టు విచారిస్తోంది. మాల్యా, నీరవ్ ఇద్దరూ భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ వచ్చేశారు. వీరిద్దరి అప్పగింతకు సంబంధించి ప్రక్రియ వేగం అందుకుంది. నిందితులు ఇద్దరూ లండన్‌లో విలాసవంతమైన ఫ్లాట్లలోనే గడిపేస్తున్నారు. ఇటీవలే నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం మోదీ చేసుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేయగా, శుక్రవారం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విజయ్‌మాల్యా కేసు విచారణ సందర్భంగా తనకు భారత్ జైళ్లలో భద్రత లేదని అతడు వాదించారు. దీంతో మాల్యాను ఎలాంటి జైలులో ఉంచబోతున్నారని మెజిస్ట్రేట్ అడిగారు. ముంబయి ఆర్థర్‌రోడ్‌లోని కారాగారంలో మాల్యా కోసం సిద్ధం చేసిన జైలు గదిని వీడియో ద్వారా వెస్ట్‌మినిస్టర్ కోర్టుకు చూపించారు. దేశంలోనే అత్యంత భద్రత, సౌకర్యాలున్న జైలు ఆర్థర్‌రోడ్ రోడ్ కారాగారమని కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖ పేర్కొంది. శుక్రవారం నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ ఎమ్మా మాట్లాడుతూ ‘మాల్యా జైలు గది విశాలంగానే ఉన్నట్టుగానే కనిపించింది’అని సరదా వ్యాఖ్యలు చేశారు.